ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించారు

Wed Oct 16 2019 17:06:24 GMT+0530 (IST)

సాయి తేజ్- మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ప్రతి రోజు పండగే' డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కి ఇంకా రెండు నెలలే ఉన్నా ఇంత వరకూ రిలీజ్ డేట్ ప్రకటించని మేకర్స్ ఎట్టకేలకు విడుదల తేదీ ను ప్రకటించారు. డిసెంబర్ 20న సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది అప్పటి నుండి సెలెబ్రెట్ చేసుకుందాం అంటూ రిలీజ్ డేట్ తో పోస్టర్ వదిలారు.ఇదే పోస్టర్ లో గ్లిమ్స్ రెస్పాన్స్ కి థాంక్స్ చెప్పారు మేకర్స్. తాత మనవడి జర్నీ తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. నవంబర్ ఎండింగ్ వరకూ జరగనున్న చివరి షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

ఇక డిసెంబర్ లో ఇప్పటికే రవి తేజ 'డిస్కో రాజా' - నితిన్ 'భీష్మ' విడుదలవుతున్నాయి. అనుష్క నటిస్తున్న 'నిశ్శబ్దం' కూడా అదే నెలలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి సంక్రాంతికి పెద్ద హీరోలు తమ సినిమాలతో పోటీ పడుతుంటే యంగ్ హీరోలు క్రిస్మస్ పోటీలో నిలిచారు.