Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ డైరెక్టర్‌, నాచురల్‌ స్టార్‌... ఏదో జరుగుతోంది!

By:  Tupaki Desk   |   24 May 2022 2:30 AM GMT
కేజీఎఫ్‌ డైరెక్టర్‌, నాచురల్‌ స్టార్‌... ఏదో జరుగుతోంది!
X
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తుంది. కేజీఎఫ్ 2 తో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ప్రశాంత్ నీల్‌ స్థాయి.. స్టామిన ఏంటో అందరికి తెల్సిందే. రాజమౌళి మాత్రమే కాకుండా బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్ రికార్డులను కూడా ఈజీగా బ్రేక్ చేసిన ఘనత ఆయనకే దక్కింది. కేజీఎఫ్‌ 2 సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ చేస్తున్న సినిమా 'సలార్‌' అనే విషయం తెల్సిందే.

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ సినిమా ఇప్పటికే షూటింగ్‌ 30 శాతం వరకు పూర్తి అయ్యింది. వచ్చే ఏడాది లో ఎన్టీఆర్‌ 31 సినిమాను ప్రశాంత్‌ నీల్‌ చేయబోతున్న విషయం తెల్సిందే. సలార్‌.. ఎన్టీఆర్‌ 31 సినిమాలు మాత్రమే కాకుండా చాలా సినిమాలకు ప్రశాంత్‌ నీల్ కమిట్‌ అయ్యి ఉన్నాడు. ఇంతటి బిజీగా ఉన్న ప్రశాంత్‌ నీల్ తెలుగు నాచురల్‌ స్టార్‌ నానితో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.

నాని హీరోగా ఈమద్య కాలంలో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా శ్యామ్‌ సింగరాయ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

అందుకే నాని ప్రస్తుతం చేస్తున్న దసరా సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. దసరా తర్వాత నాని నుండి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమా లు వచ్చే అవకాశం ఉంది.

ఇక కేజీఎఫ్‌ 2 తో పాన్‌ ఇండియా స్థాయిలో స్టార్ డైరెక్టర్ గా ప్రశాంత్‌ నీల్‌ నిలిచిన వియం తెల్సిందే. అందుకే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాని మరియు ప్రశాంత్‌ నీల్‌ కాంబో గురించి అసలు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు.

ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో మూవీ అంటూ వచ్చిన వార్తలు అన్నీ కూడా పుకార్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిప్పు లేకుండా పొగ అనేది రానే రాదు. చిన్న లీడ్‌ కూడా లేకుండా అంత పెద్ద పుకారు అనేది ఇంతగా ప్రచారం అవ్వడం అసాధ్యం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది నాని లేదా నీల్‌ ల్లో ఎవరో ఒకరు స్పందిస్తే కాని అసలు విషయం తెలియదు.