'ఆదిపురుష్' వస్తున్నాడని హనుమాన్ ఆగాడు..!

Thu Sep 29 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

Prashant Verma movies hanuman movie news

యంగ్ రెబల్ స్టార్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ ను దసరా సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై రేపు అధికారికంగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి ప్రకటనతో కూడిన పోస్టర్ రాబోతుందట. టీజర్ విడుదల తేదీ మరియు వెన్యూ ఇలా అన్ని విషయాల గురించి క్లియర్ గా మరి కొన్ని గంటల్లో అధికారికంగా ప్రకటించబోతున్నారు.ఆదిపురుష్ సినిమా యొక్క టీజర్ విడుదల కాబోతున్న నేపథ్యంలో మా హనుమాన్ యొక్క టీజర్ ను దసరాకు అనుకున్నప్పటికి వాయిదా వేసుకుంటున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా రూపొందుతున్న హనుమాన్ సినిమా యొక్క టీజర్ ను దసరాకు విడుదల చేయాలని మొన్నటి వరకు భావించారు.

రాముడి తర్వాత హనుమంతుడు.. రాముడితో పోటీగా హనుమంతుడు రాడు అంటూ ప్రశాంత్ వర్మ చాలా లాజిక్ గా ఆదిపురుష్ టీజర్ వచ్చిన తర్వాత మా యొక్క హనుమాన్ టీజర్ విడుదల కొత్త తేదీని ప్రకటిస్తాం అన్నాడు. ప్రభాస్ యొక్క ఆదిపురుష్ టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

దేశవ్యాప్తంగా ప్రభాస్ ఆదిపురుష్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా విషయంలో ఆసక్తిని కనబర్చడానికి కారణం రామాయణం ఇతివృత్తం తో ఈ సినిమా రూపొందడమే. పైగా ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ గ్రాఫిక్స్ మూవీగా ప్రచారం చేస్తున్నారు. ఈ కారణాల వల్ల ఆదిపురుష్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఆదిపురుష్ టీజర్ తో పోటీ వద్దు అనుకుని హనుమాన్ టీజర్ ను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.