Begin typing your search above and press return to search.

మరో మైథ‌లాజిక‌ల్ కథతో ప్రశాంత్ వర్మ

By:  Tupaki Desk   |   7 Feb 2023 5:00 PM GMT
మరో మైథ‌లాజిక‌ల్ కథతో ప్రశాంత్ వర్మ
X
కొత్త త‌ర‌హా క‌థ‌లు ఆలోచించ‌డంలో ప్ర‌శాంత్ వ‌ర్మ స్పెషలిస్టు అనడంలో సందేహం లేదు.. ఆ!, క‌ల్కి, జాంబిరెడ్డి లాంటి సినిమాలు తీసి సూపర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా హనుమాన్ తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న సంగతి తెలిసిందే. తేజా స‌జ్జా హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సూపర్ హీరో కాన్సెప్ట్ వస్తున్న ఈచిత్రం హిట్ ఖాయమని అనుకుంటున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రశాంత్ వర్మ తన నెక్ట్స్ సినిమా హీరో ఫేం అశోక్ గల్లాతో ఇటీవల ప్రకటించాడు. ఈ సినిమాకు అర్జున్ జంథ్యాల దర్శకత్వం వహించగా.. ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నాడు. ఇది మాస్ సినిమానే... కాక‌పోతే.. దానికి మైథ‌లాజిక‌ల్ అంశాలూ ముడి వేశాడు ప్రశాంత్. హీరో సినిమా అనుకొన్నంత ఫ‌లితం తీసుకురాక‌పోవ‌డంతో... రెండో సినిమాపై బాగా ఫోక‌స్ చేశాడు అశోక్ గ‌ల్లా.

దాదాపు వంద క‌థ‌లు విన్న త‌ర‌వాత‌.. ప్ర‌శాంత్ వ‌ర్మ చెప్పిన క‌థ‌ని ఓకే చేశారని తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు అర్జున్ జంథ్యాల ఇది వ‌ర‌కు గుణ 369 తీశాడు. తీశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.

కానీ మేకింగ్ ప‌రంగా బాగుంటుంది. చివ‌ర్లో ట్విస్టు కూడా ఆక‌ట్టుకొంటుంది. పైగా అర్జున్ బోయ‌పాటి శ్రీ‌ను శిష్యుడు ఈ అర్జున్. బోయ‌పాటి లా హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేయ‌గ‌ల‌డు. అందుకే ఈ క‌థ‌ని.. అర్జున్ చేతిలో పెట్టారు. ఈ రోజే హైద‌రాబాద్‌లో ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. హీరోయిన్‌, విల‌న్ పాత్ర‌ల కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది.

లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ప్రశాంత్ వర్మ హనుమాన్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. హను-మాన్‌లో లాగానే అశోక్‌గల్లా సినిమాలో మైథలాజికల్ అంశాలు ఉండనున్నాయి.

దాంతో పాటు వినోదం కూడా ఉంటుందని తెలుస్తోంది. భారతీయ పురాణాలలోని శక్తివంతమైన పాత్రల ఆధారంగా సూపర్ హీరోల వరుస చిత్రాలను తీయనున్నట్లు ప్రశాంత్ వర్మ గతంలో ప్రకటించారు. చూడాలి ఈ సినిమా ఏ రేంజ్లో ఆకట్టుకుందో అనేది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.