చేపకళ్ల ప్రణీత అండర్ వాటర్ సాహసాలు

Sat Nov 21 2020 13:40:51 GMT+0530 (IST)

Pranitha Underwater Adventures

స్కూబా డైవింగ్ అనేది ప్రత్యేకమైన శిక్షణ ఉన్నవారికే. ఇందులో నిష్ణాతులైన స్టార్లు ఉన్నారు మనకు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లకు ఇది నిరంతర వ్యాపకం. గోవా .. మాల్దీవుల్లో ఇలాంటి విన్యాసాలకు అవసరమైన వెసులుబాటు ఉంది.ఇంతకుముందు సోనాక్షి సిన్హా.. శ్రద్ధా కపూర్.. పరిణీతి చోప్రా లాంటి నాయికలు స్కూబా డైవింగ్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. తెలుగులో కాజల్ అగర్వాల్.. శర్వానంద్ వంటి స్టార్లు స్కూబా డైవింగ్ చేశారు.

తాజాగా అలాంటి ఫీట్ నే వేసింది చేపకళ్ల ప్రణీత. ఈ అమ్మడు ఇటీవల ఫ్రీ టైమ్ ని ఎంతో జోవియల్ గా ఎంజాయ్ చేస్తోంది. అలా సెలబ్రేట్ చేసిన ఫోటోలు వీడియోల్ని సోషల్ మీడియాల్లో ప్రణీత విస్త్రతంగా షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంది. స్కూబా డైవింగ్ లో సర్టిఫికెట్ సంపాదించాను అంటూ ప్రణీత ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చింది. అండర్ వాటర్ డైవ్ చేస్తున్న ఫోటోల్ని ట్విట్టర్ లో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి.

కాజల్ - గౌతమ్ కిచ్లు జంట మాల్దీవుల్లో అండర్ వాటర్ లివింగ్ రూమ్ లో నివశిస్తూ స్కూబా డైవింగ్ ని ఆస్వాధిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాల్దీవుల్లోనే విహరిస్తున్న ప్రణీత తాను కూడా అండర్ వాటర్ స్పోర్ట్ ని ఎంజాయ్ చేస్తోంది. స్కూబా డైవింగ్ .. అండర్ వాటర్ స్కూటర్ డ్రైవింగ్ తో అదరగొట్టింది ఈ భామ.