Begin typing your search above and press return to search.

పెళ్లి పీఠలెక్కిన పవర్ స్టార్ హీరోయిన్.. వైరల్ ఫోటోస్!

By:  Tupaki Desk   |   31 May 2021 9:31 AM GMT
పెళ్లి పీఠలెక్కిన పవర్ స్టార్ హీరోయిన్.. వైరల్ ఫోటోస్!
X
ఈ కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ పడిన ప్రతిసారి సినీ సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కుతూనే ఉన్నారు. గతేడాది కాలంగా సినిమా ఇండస్ట్రీలోని చాలామంది హీరోలు హీరోయిన్స్ పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. ఇప్పుడు అదేబాటలో అడుగేసింది సౌత్ బ్యూటీ ప్రణీత. ఈ బెంగుళూరు బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితం. అయితే కొంతకాలంగా ప్రణీత టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. లాక్డౌన్ లో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టిన ప్రణీత.. తన ఫ్యాన్స్ అందరికి షాకిచ్చింది. ఆదివారం బెంగుళూరులోని తన స్వగృహంలో ప్రణీత.. నితిన్ రాజు అనే యంగ్ బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది. అయితే ఇది లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్ అని ప్రణీత మీడియాతో తెలిపింది.

కేవలం అతికొద్దిమంది స్నేహితులు - సన్నిహితుల మధ్య ప్రణీత పెళ్లి బంధంలో అడుగుపెట్టింది. అలాగే ప్రణీత మాట్లాడుతూ.. 'మేమిద్దరం ఎంతో కాలంగా పరిచయం. తాను నేను మా కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమయ్యాం. కొన్నేళ్లుగా ఇద్దరం ఒకరినొకరు అర్ధం చేసుకున్నాం. చివరిగా ఇలా పెళ్లి బంధంతో జీవితాంతం ఒకరికొకరుగా కలిసి బతకాలని నిర్ణయించుకున్నాం. మా రెండు ఫ్యామిలీస్ కూడా మా పెళ్లి అంగీకారం తెలిపి దగ్గరుండి వారి ఆశీర్వాదం అందించారు. చాలా సింపుల్ గా కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ మా పెళ్లి జరుపుకున్నాం' అని చెప్పుకొచ్చింది.

అలాగే ప్రణీత ఇంకా మాట్లాడుతూ.. "ఎంతో కాలంగా మిగిలి ఉన్నటువంటి నా పెళ్లి కలను ఈ కరోనా మహమ్మారి నిజం చేసిందనే చెప్పాలి. నిజానికి నేను చాలా ప్రైవేట్ పర్సన్. ఎవరితో పెద్దగా కలవలేను. అలాగే పెద్దగా పబ్లిక్ లో ఉండటానికి ఇష్టపడను. అందుకే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా నేను కోరుకున్నట్లుగానే పెళ్లి జరిగినందుకు ఆనందంగా ఉంది. మా పెళ్లి సింపుల్ గా జరగాలని మా ఫ్యామిలీస్ తో చాలా ఫైట్ చేశాను. ఆఖరికి నేను అనుకున్నట్లుగానే జరిగింది. మేం మాతో పాటు మా సన్నిహితుల సమక్షంలో మాత్రమే మా పెళ్లి జరిగింది. అలాగే కరోనా పాండమిక్ తర్వాత తన మిగతా ఫ్రెండ్స్ అందరికి ఓ విందు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. మొత్తానికి ప్రణీత కోరుకున్న ప్రియుడినే పెళ్లి చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రణీత తెలుగులో బావ - అత్తారింటికి దారేది లాంటి హిట్ సినిమాల్లో నటించింది.