ప్రాణం: మనసును సున్నితంగా మీటుతోందే

Tue Jan 21 2020 17:54:45 GMT+0530 (IST)

Pranam Lyrical Video From Sharwanand And samantha Jaanu movie

దిల్ రాజు బ్యానర్లో శర్వానంద్.. సమంతా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం 'జాను'.   తమిళ సూపర్ హిట్ '96' కు రీమేకే ఈ 'జాను'.  తమిళ ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహిస్తున్నారు.  తాజాగా ఈ సినిమానుండి 'ప్రాణం' అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలయింది.ఈ సినిమాకు సంగీత దర్శకుడు గోవింద వసంత.  'ప్రాణం' పాటకు సాహిత్యం అందించిన వారు శ్రీమణి.  చిన్మయి శ్రీపాద.. గౌతమ్ భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు.  "ప్రాణం నా ప్రాణం నీతో ఇలా గానం తొలి గానం పాడే వేళ తారాతీరం మన దారిలో కాంతులే కురిసేలా చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా" అంటూ ఈ పాట సాహిత్యం సింపుల్ పదాలతో మాయ చేసేలా సాగింది.  ఈ పాటకు గోవింద వసంత  సున్నితంగా మనసు తీగలను అలా మీటినట్టు ఉండే ట్యూన్ ఇచ్చారు. ఈ పాటను అంతకంటే అందమైన ఫీల్ తో.. ఎంతో సున్నితంగా చిన్మయి.. గౌతమ్ పాడారు.  ఈమధ్యకాలంలో తెలుగు సినిమాలలో వచ్చిన బెస్ట్ మెలోడీస్ లో ఇదొకటి అని చెప్పొచ్చు.  పాట ట్యూన్ లో కొంత బాధ ధ్వనిస్తున్నప్పటికీ అదే ఈ పాటను మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తోంది. మనసు పెట్టి నాలుగు సార్లు వింటే ఈ పాట ప్రేమలో పడిపోవడం ఖాయం.

తమిళంలో ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.  అయితే ఇప్పటి వరకూ రీమేక్ కు పెద్దగా బజ్ లేదు. ఈ పాట ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని 'జాను' వైపు తిప్పేలా ఉంది.  ఆలస్యం ఎందుకు వినేయండి.. ప్రాణం.