'సరిలేరు నీకెవ్వరు' లో విలన్ ఎవరు?

Sun Dec 15 2019 21:48:26 GMT+0530 (IST)

Prakash Raj Wont Be As Dangerous As In Okkadu In SLN

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. అనీల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన కథానాయిక. ఇటీవలే రిలీజైన టీజర్ రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. టీజర్ లో రకరకాల పాత్రల్ని పరిచయం చేశారు. అయితే ఈ టీజర్ చూసిన ప్రతి ఒక్కరికీ కలిగిన అనుమానం ఇంతకీ ఇందులో విలన్ ఎవరు? అనేదే. ``ఈ పండక్కి మొగుడొచ్చాడు`` అంటూ ప్రకాష్‌రాజ్ పంచ్ వేయడంతో ఈ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. టీజర్ లో... ముఖం అంతా చిట్లించుకుని ప్రకాష్ చెప్పిన డైలాగ్ ని బట్టి ఇందులో ఆయనే విలన్ గా నటిస్తున్నట్లు అర్థమవుతోంది.ఆర్మీకి చెందిన స్థలాన్ని రాజకీయ నాయకుడైన ప్రకాష్ రాజ్ కబ్జా చేస్తే అతని కళ్లు తెరిపించే క్రమంలో మహేష్ తన చుట్టూ వున్న వాళ్లకి బడితపూజ చేస్తాడు మహేష్. ఆ క్రమంలో వచ్చే `మనదగ్గర బేరాల్లేవమ్మా..` డైలాగ్ ఇద్దరి మధ్య వచ్చే ఇంటెన్సివ్ సీన్స్ కి కొదవేమీ లేదని అర్థమైంది. మహేష్.. ప్రకాష్ రాజ్ కలయికలో వచ్చిన పోకిరి.. ఒక్కడు వంటి చిత్రాల్లో ఇద్దరి మధ్య వచ్చిన సీన్స్.. వైరం కీలకంగా అలరించాయి. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్లు కావడంలో ప్రధాన భూమికను పోషించాయి. అదే మ్యాజిక్ `సరిలేరు నీకెవ్వరు` చిత్రానికి కూడా వర్కవుట్ అవుట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

అయితే `ఒక్కడు` చిత్రంలోని కొండారెడ్డి బురుజు.. ప్రకాష్ రాజ్ చెప్పే రొటీన్ డైలాగ్ లు చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతోందని సగటు ఆడియన్ ఫీలవుతున్నాడు. మరి అది థియేటర్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందా?  లేక ఒక్కడు.. పోకిరి మ్యాజిక్ రిపీట్ అయి `సరిలేరు నీకెవ్వరు` బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందా? అన్నది తెలియాలంటే జనవరి 11 వరకు వేచి చూడాల్సిందే.