Begin typing your search above and press return to search.

'క్లాప్' సెట్స్ లో జాయిన్ అయిన విలక్షణ నటుడు..!

By:  Tupaki Desk   |   25 Nov 2020 12:10 PM GMT
క్లాప్ సెట్స్ లో జాయిన్ అయిన విలక్షణ నటుడు..!
X
ఆది పినిశెట్టి - ఆకాంక్ష సింగ్ ('మళ్లీరావా' ఫేమ్) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''క్లాప్". శ‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌ మరియు శ్రీ షిర్డీసాయి మూవీస్ ప‌తాకాల‌పై రామాంజ‌నేయులు జ‌వ్వాజి - ఎం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ అధినేత ఐ.బి. కార్తికేయ‌న్ 'క్లాప్' చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో బైలింగ్విల్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా త‌యార‌వుతున్న 'క్లాప్'‌ షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది.

కరోనా లాక్‌ డౌన్ త‌ర్వాత బుధ‌వారం చెన్నైలో షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ లో హీరో ఆది పినిశెట్టి - కీల‌క పాత్ర‌ధారి ప్ర‌కాష్ రాజ్‌ మరియు ఇత‌ర‌ ప్ర‌ధాన తారాగ‌ణంపై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఊహించిన దానికి మించి స‌న్నివేశాలు చాలా బాగా వ‌చ్చాయనీ.. చెన్నైలోని ఓ భారీ స్టేడియంలో క‌థ‌కు కీల‌క‌మైన స్పోర్ట్స్ బేస్డ్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నామ‌నీ నిర్మాత‌లు తెలిపారు. షూటింగ్ పుర్టైన వెంటనే శరవేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రిపి.. త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత స్వ‌రాలు అందిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వ్యవహరిస్తున్నారు. రాగుల్‌ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కృష్ణ కురుప్‌ - నాజర్ - బ్రహ్మాజీ - రాందాసు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.