దెబ్బకు ప్రగ్య దశ దిశ తిరిగిపోయిందిగా

Wed Sep 22 2021 10:54:26 GMT+0530 (IST)

Pragya won another Golden Chance in Film

`కంచె` సినిమాలో `హాలో షేక్ స్పియర్` అంటూ తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది ప్రగ్యా జైస్వాల్. తొలి చిత్రం క్లాస్ హీరోయిన్ గా ప్రగ్యాకు పేరు తీసుకురావడంతో ఆమె ఆ తరువాత చేసిన సినిమాలేవీ పెద్దగా సంతృప్తినివ్వలేకపోయాయి. కమర్షియల్ సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి. గ్లామర్ పాత్రల్లో నటించి అందాల విందుకు అడ్డు చెప్పకున్నా ప్రగ్యాకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఏ సినిమా చేసినా ఫలితం లేకుండా పోయింది.`ఆచారి అమెరికా యాత్ర` తరువాత ప్రగ్యా తెలుగులో సినిమా చేయడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న `అఖండ`లో బాలయ్యకు జోడీగా నటిస్తోంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయమం చేస్తున్న విషయం తెలిసిందే. కలెక్టర్ పాత్రతో పాటు ఇందులో ఆయన అఘోరాగానూ కనిపించనున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దాదాపుగా చివరి దశకు చేరుకుంది.

ఈ సినిమాతో పాటు ప్రగ్యా మరో గోల్డెన్ ఛాన్స్ ని సొంతం చేసుకుంది. అదే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న `అంతిమ్` చిత్రంలో ప్రగ్యా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది గనక బాలీవుడ్ లో విజయం సాధిస్తే ప్రగ్యా దశ తిరిగినట్టు అంటున్నారు. మరోవైపు పవన్ సరసన ప్రగ్యకు ఆఫర్ దక్కిందన్న ప్రచారం ఉంది. దీనిపై అధికరికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలా వుంటే సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ని తన హాట్ హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న ప్రగ్యా తాజాగా ముంబై ఏయిర్ పోర్ట్ లో సందడి చేసింది. చిట్టి పొట్టి డ్రెస్సులో దర్శనమిచ్చి చూపరులని కట్టిపడేసింది. థైస్ కనిపించేలా షార్ట్.. కళ్లకు బ్లాక్ గాగుల్స్.. హియర్ రింగ్స్ .. చేతిలో పర్సనల్ వాలెట్ తో చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.