ఫొటోటాక్ : ప్రగ్యా నెగటివ్ హాట్ షో

Mon Oct 18 2021 21:00:01 GMT+0530 (India Standard Time)

Pragya Jaiswal Latest Photo

తెలుగు ప్రేక్షకులకు కంచె సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా తర్వాత తెలుగు లో ఈమెకు పలు ఆఫర్లు అయితే వచ్చాయి కాని బిగ్గెస్ట్ కమర్షియల్ బ్రేక్ మాత్రం దక్కలేదు. ఆమె అందంకు స్టార్ హీరోయిన్ హోదా ఇవ్వాల్సిందే అనేది అభిమానుల అభిప్రాయం. కాని ఆమె అదృష్టం కలిసి రాకపోవడం లేదా మరే కారణమో కాని తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ప్రగ్యా జైస్వాల్ కు అంతంత మాత్రంగానే ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అమ్మడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ రెగ్యులర్ గా హాట్ ఫొటో షూట్ లు షేర్ చేస్తూ ఉంటుంది. ఇంత అందంగా ఉన్న ప్రగ్యా జైస్వాల్ ను ఫిల్మ్ మేకర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదు.. అసలు వారికి ఈమె విషయంలో కళ్లు కనిపించడం లేదా అంటూ పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.తాజాగా మరో హాట్ ఫొటోలతో ప్రగ్యా సోషల్ మీడియాలో సందడి చేసింది. అయితే ఈసారి నెగటివ్ వచ్చిన ఆనందంతో ఈ ఫొటోలను షేర్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది. నెగటివ్ పదం ఇంత ఆనందంను ఇస్తుందని ఇప్పటి వరకు తెలియదు అంటూ ఆమె పోస్ట్ చేసింది. కరోనా టెస్టులో నెగటివ్ రావడం వల్ల ఆమె హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లుగా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నెట్టింట కరోనా గురించి తెగ ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రగ్యా జైస్వాల్ ఆ విషయాన్ని కూడా తన హాట్ షో తో షేర్ చేయడంను చూసి ఆమె అభిమానులతో పాటు అంతా కూడా ఆమె క్రియేటివిటీకి ఫిదా అవుతున్నామని కామెంట్స్ చేస్తున్నారు.

ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ ఎట్టకేలకు ఒక స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అదే అఖండ సినిమా. బాలయ్య.. బోయపాటి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకుంటుంది అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. అలాంటి సినిమాలో ప్రగ్యా జైస్వాల్ కు దక్కిన అవకాశం ఎంత వరకు సద్వినియోగం అవుతుంది అనేది చూడాలి. బాలయ్య అఖండ సినిమా విడుదల అయ్యి సక్సెస్ టాక్ దక్కించుకుంటే.. అందులో ప్రగ్యా జైస్వాల్ కు మంచి పాత్ర దక్కితే ఖచ్చితంగా ఆమె కెరీర్ లో ఓ అయిదు ఏళ్ల పాటు అవకాశాలు కు కరువు ఉండదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.