స్టార్ హీరోయిన్ కావాలని ఒకే ఒక్క ఆశ

Fri Sep 24 2021 08:00:01 GMT+0530 (IST)

Pragya Jaiswal About Her Role In Akhanda

తనదైన అందం అభినయంతో ఇప్పటికే తెలుగు యువత మనసు దోచింది ప్రగ్య జైశ్వాల్. కానీ రకరకాల కారణాలతో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ప్రస్తుతం అఖండ లాంటి భారీ ప్రాజెక్టుపై బోలెడన్ని హోప్స్ పెట్టుకుంది. ఇంతకీ ఈ చిత్రంలో తన పాత్ర ఎలా ఉండనుంది? అని ప్రశ్నిస్తే.. దానిపై స్పందించింది ఈ కుర్రబ్యూటీ.దర్శకుడు బోయపాటి శ్రీను తన పాత్ర  రూపాన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసారని ప్రగ్య చెప్పింది. సినిమాలో నా లుక్ చాలా భిన్నంగా ఉంటుంది. బోయపాటి సర్ నా గత సినిమాల్లో గెటప్ లు చూసి ఈసారి కొత్తగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో నేను విభిన్నంగా లేదా ప్రత్యేకంగా కనిపించాలని కోరుకున్నారు.  నా పాత్రపై ఎంతో కసరత్తు చేశారు. నా పాత్రకు పూర్తి తాజాదనాన్ని ఇవ్వాలనుకోవడం ఒక సవాల్ గా నిలిచింది.. అని ప్రగ్యా అన్నారు.

బోయపాటి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు.  బోయపాటి మూవీ అనగానే థియేటర్ రేంజ్ మూవీ అని మీకు తెలుసు. పూర్తి యాక్షన్ డ్రామా.. వినోదం ఉంటాయి. ఇది చాలా ఉత్కంఠ పెంచే కథతో తెరకెక్కింది. అందుకే ఎంతో ఆసక్తిగా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను.. అని తెలిపారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని `అడిగా అడిగా` పాట ఆకట్టుకుంటోంది. ఇందులో నా లుక్ మెప్పించింది. నా సినిమాలోని మొదటి పాట చివరకు విడుదలైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.. అని అన్నారు. ఈ పాటను చాలా అందంగా చిత్రీకరించారు. ఇందులో నేను చాలా అందంగా కనిపిస్తున్నాను. లిరికల్ వీడియో వైరల్ గా దూసుకెళుతోంది. ..అని ప్రగ్య అన్నారు. ప్రగ్య తదుపరి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ .. మంచు విష్ణు చిత్రాల్లో నటించనుందని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన నాయికగా నటిస్తోంది.