బాలయ్య గురించి ప్రగ్యా.. అంతకు ముందు ఆ తర్వాత

Mon Jul 26 2021 20:59:36 GMT+0530 (IST)

Balayya taught me a lot pragya jaiswal

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం తమిళనాడులో బాలకృష్ణ.. ప్రగ్యా జైస్వాల్ ఇంకా కీలక నటీనటులపై షూటింగ్ జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ షెడ్యూల్ తో సినిమా కు గుమ్మడికాయ కొట్టబోతున్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న ప్రగ్యా జైస్వాల్ తాజా చిట్ చాట్ లో అఖండ గురించి.. ఆ తర్వాత బాలయ్య తో వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడింది. ప్రగ్యా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నందమూరి అభిమానులు షేర్ చేస్తున్నారు.అఖండ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వక ముందు బాలకృష్ణ గారితో షూటింగ్ సమయంలో కాస్త ఇబ్బంది ఉంటుంది.. ఆయన చాలా కోపంతో ఉంటారని.. ఆయన పదే పదే టేక్ లు తింటే విసుక్కుంటాడు అంటూ కొందరు చెప్పారు. దాంతో నేను ఆయనతో షూటింగ్ అనగానే భయపడ్డాను. కాని ఎప్పుడైతే షూటింగ్ లో జాయిన్ అయ్యానో అప్పుడు ఆయన గురించి మొత్తం తెలిసి పోయింది. ఆయన చాలా జోవియల్ గా ఉంటారు. ఆయన చాలా సహనంగానే షూటింగ్ సమయంలో కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆయన విసుక్కున్నది లేదు. అలాగే నాకు చాలా సందర్బాల్లో చాలా విషయాలను నేర్పించారు. షూటింగ్ గ్యాప్ లో ఆయనతో కూర్చున్న సమయంలో చాలా సరదాగా జోకులు వేస్తూ అందరి తో నవ్వుతూ ఉంటారు అంటూ ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది.

బాలయ్య గురించి ఇప్పటి వరకు కొందరిలో ఉన్న అనుమానాలకు ప్రగ్యా జైస్వాల్ వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చినట్లయ్యింది. ఆమె మాట్లాడుతూ బాలయ్య తో షూటింగ్ అనుభవం చాలా నేర్పించింది అంటూ వ్యాఖ్యలు చేయడం నందమూరి అభిమానులకు పాజిటివ్ వైబ్స్ ను కలిగించింది. ఇక అఖండ సినిమా విషయానికి వస్తే బోయపాటి ఈ సినిమాను అత్యంత పవర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా లో ప్రగ్యా కోసం బోయపాటి చాలా పవర్ ఫుల్ రోల్ ను రాశాడు. ఇప్పటి వరకు ప్రగ్యా చాలా సినిమాల్లో నటించింది. కాని ఇంత పవర్ ఫుల్ రోల్ మాత్రం చేయలేదు.. ఇక ముందు కూడా చేస్తుందో లేదో తెలియదు అంటూ యూనిట్ సభ్యులు అంటున్నారు.