ప్రగతి రచ్చ.. బ్యాండ్ పై ఎక్కేసిందిగా..

Sat Dec 03 2022 11:00:01 GMT+0530 (India Standard Time)

Pragathi On top of the band..

చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇటీవల కాలంలో మంచి గుర్తింపును అందుకుంటున్నారు. వారు కూడా సోషల్ మీడియాలోకి రావడంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. ఇక ఆ విధంగా చాలా తొందరగా క్లిక్ అయినా క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి ఒకరు. ఆమె మొదట్లో హీరోయిన్ గా కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. కానీ పెద్దగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు రాకపోవడంతో మళ్లీ వెంటనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.ఐదు పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా ఆమె నేటి తరం యువ హీరోయిన్స్ తరహాలోనే నేటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటోంది. జిమ్ లో గంటల తరబడి వర్కౌట్ చేసే ప్రగతి తరచుగా వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఆమెకు ఉల్లాసం వస్తే ఎలా ఉంటుందో ఇటీవల ఒక వీడియోతో చూపించింది. తన సోదరి మ్యారేజ్ లో ఆమె ఎంజాయ్ చేసిన విధానం నేటిజన్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఓ వ్యక్తి బ్యాండ్ కొడుతూ ఉండగా.. దానిపైన ప్రగతి ఎక్కేసింది. అక్కడితో ఆగకుండా డాన్స్ కూడా చేసింది. అయితే వెనకాల ఆ వ్యక్తి మాత్రం మోయలేక ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా సిస్టర్ మ్యారేజ్ లో ఆమె కంట్రోల్ లేని విధంగా ఎంజాయ్ చేసినట్లు అనిపిస్తుంది. ప్రగతి ఇంతకుముందు కూడా కొన్ని డ్యాన్స్ వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.

ఆమె విడియోలలో ఒకవైపు డాన్స్ టాలెంట్ తో పాటు మరొకవైపు తన గ్లామర్ ను కూడా హైలెట్ చేసుకుంటూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కూడా ఇంకా యువ హీరోయిన్స్ తరహాలోనే ఆమె హైలెట్ అవుతోంది. ఇక ప్రగతికి పెళ్లీడుకొచ్చిన కూతురు కూడా ఉంది. అలాగే తన పిల్లల స్నేహితులతో కూడా ఆమె తరచుగా పార్టీలలో పాల్గొంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం ప్రగతి తెలుగు తమిళ సినిమాలతో చాలా బిజీగా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.