Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ 3డి.. ఆ త‌ర్వాత అంత‌కుమించి!!

By:  Tupaki Desk   |   28 Sep 2020 5:15 AM GMT
ఆదిపురుష్ 3డి.. ఆ త‌ర్వాత అంత‌కుమించి!!
X
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల్ని ప్ర‌క‌టించి మైండ్ బ్లాంక్ చేసిన సంగ‌తి తెలిసిందే అతడు న‌టిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌కుడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ , గోపీ కృష్ణా మూవీస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీతో పాటు మ‌రో రెండు భారీ చిత్రాల్ని ప్ర‌భాస్ అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. నాగ్ అశ్విన్ - వైజ‌యంతీ మూవీస్‌తో ఓ చిత్రం. ఇది భారీ సైన్స్ ఫిక్ష‌న్‌. ఆ త‌ర్వాత అంత‌కుమించి..

ఈ మూవీతో పాటు బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆది పురుష్‌` చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. రామాయ‌ణ గాధ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ మూవీలో రావ‌ణాసురుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. కాస్టింగ్ ప‌రంగా.. మేకింగ్ ప‌రంగా ఈ మూవీ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి మ‌రో వార్త హ‌ల్ ‌చ‌ల్ చేస్తోంది. ఇందులో సీత‌.. ల‌క్ష్మ‌ణుడు.. హ‌నుమాన్ పాత్ర‌ల్లో ఎవ‌రు న‌టిస్తారంటూ ఆస‌క్తిక‌ర‌మైన ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. వ‌చ్చే నెల ప్ర‌భాస్ పుట్టిన రోజు నేప‌థ్యంలో ఈ చిత్రంలోని సీత‌.. ల‌క్ష్మ‌ణ్ మ‌రియు హ‌నుమాన్ పాత్ర‌ల్ని మేక‌ర్స్ రివీల్ చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. అయితే ఇందులో వున్న నిజ‌మెంత‌? నిజంగానే ఆరోజు మేక‌ర్స్ కొత్త విష‌యాల్ని వెల్ల‌డించ‌నున్నారా? అన్న‌ది తెలియాలంటే వేచి చూడాల్సిందే.