ఆదిపురుష్ గురించి ప్రభాస్ శ్రీను ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

Mon Sep 26 2022 20:19:48 GMT+0530 (India Standard Time)

Prabhas sreenu comments on adipurush

తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆదిపురుష్ అనడంలో సందేహం లేదు. ఒక వైపు అయోధ్యలో వందల ఏళ్లుగా ఎదురు చూస్తున్న రామాలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్ర ను చేయడం ఆయన అదృష్టం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఆదిపురుష్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి చిన్న అప్‌డేట్ కూడా చిత్ర యూనిట్ సభ్యులు లీక్ అవ్వకుండా చూశారు. కనీసం స్టిల్ కూడా బయటకు రాలేదు. ఒకటి రెండు సార్లు లీక్ అయినట్లుగా వార్తలు వచ్చినా వాటిని ఎక్కువ శాతం మంది చూసిందే లేదు. లీక్ అయిన వెంటనే యూనిట్ సభ్యులు టెక్నాలజీతో డిలీట్ చేయించారు. అందుకే ఆదిపురుష్ సినిమా యొక్క ఫస్ట్ లుక్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు.

ఈ సమయంలోనే ఆదిపురుష్ యొక్క విశేషాలను ఆ సినిమాలో పని చేసిన వారు పొడి పొడిగా పంచుకుంటూ ఉంటే అవే సినిమాపై అంచనాలు ఆకాశానికి పెంచేస్తున్నాయి. తాజాగా ప్రభాస్ కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రభాస్ శ్రీను ఆదిపురుష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన చేశాడా లేదా అనే విషయం పై క్లారిటీ లేదు కానీ ఆయన సినిమా పై చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులకు కిక్ ఇస్తున్నాయి.

ప్రభాస్ గారిని ఆదిపురుష్ షూటింగ్ లో మేము అందరం రాముడి గెటప్ లో చూసి ఆశ్చర్య పోయేవాళ్లం. ఆయన్ను అలాగే చూస్తూ ఉండి పోయేవాళ్లం. ఇలాంటి వ్యక్తి పక్కన ఉన్నందుకు చాలా అదృష్టం చేసుకోవాలి అన్నట్లుగా ఆయన లుక్ ఉండేది. రాముడిగా నటించే అవకాశం రావడం ప్రభాస్ అదృష్టం.. ప్రభాస్ ని రాముడిగా చూసే అవకాశం రావడం మా అదృష్టం అన్నట్లుగా మాట్లాడుకునేవాళ్లం.

దర్శకుడు కూడా రాముడి గెటప్ లో ప్రభాస్ ఉన్న సమయంలో అలాగే చూస్తూ ఉండేవారు అంటూ ప్రభాస్ శ్రీను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆదిపురుష్ స్థాయిని మరింతగా పెంచాయి అనడంలో సందేహం లేదు.

ఇక ఆదిపురుష్ యొక్క టీజర్ ను దసరా సందర్భంగా అయోధ్య లో జరగబోతున్న భారీ ఈవెంట్ లో రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సీత పాత్ర లో కృతి సనన్ నటించగా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.