చిన్నది మిస్సయ్యం.. నెక్స్ట్ హెవీగా ఉంటది: ప్రభాస్

Fri Oct 07 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Prabhas speach 3D Screening Of Adipurush

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ పై ఏ స్థాయిలో ట్రోలింగ్ నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా చాలా తక్కువ స్థాయి గ్రాఫిక్స్ తో తీశారు అని అంతేకాకుండా ఈ సినిమా ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా ఉండబోదు అని ఫ్యాన్స్ నుంచి సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే మరొకవైపు ఆదుపురుష్ సినిమాకు సపోర్ట్ చేసిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. తప్పకుండా వెండితెరపై చూస్తే సినిమా నచ్చుతుంది అని కూడా అందరూ అనుకుంటున్నారు.ఇక చిత్ర యూనిట్ సభ్యులు త్రీడీ వెర్షన్ లో టీజర్ను కొన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇక ప్రత్యేకంగా 3D టీజర్ లాంచ్ ను ఈరోజు నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కొంతమంది చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇక ప్రభాస్ అయితే తప్పకుండా త్రీడి వెర్షన్ లో ఈ సినిమా టీజర్ ఇంకా బాగా నచ్చుతుంది అని నమ్మకంగా తెలియజేశాడు.

నేను ఫస్ట్ టైం త్రీడీలో ఈ సినిమా టీజర్ ను చూసినప్పుడు చిన్నపిల్లాడిని అయిపోయాను. విజువల్స్ అన్నీ కూడా చాలా థ్రిల్లింగ్ గా అనిపించాయి. ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా శుక్రవారం 65 థియేటర్లలో ఈ టీజర్ ను ప్రదర్శించబోతున్నట్లు చెప్పారు. ఫ్యాన్స్ అనేది మాకు చాలా సపోర్ట్.

వాళ్లు తప్పకుండా చూడాలి. ఈ టెక్నాలజీ అనేది ఇండియాలో ఫస్ట్ టైం. ఇది బిగ్ స్క్రీన్ కోసం ప్రత్యేకంగా చూడాలి. త్రీడిలో చూస్తే బాగుంటుంది ఇక మరికొన్ని వారాల తర్వాత తప్పకుండా ఒక బ్యాంగ్ అప్డేట్ తో మళ్ళీ వస్తాము అని ప్రభాస్ నమ్మకంగా తెలియజేశాడు.

అలాగే థియేటర్ లో టీజర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా రివ్యూ కూడా ఇవ్వాలి అని ప్రభాస్ కోరాడు. అయితే ప్రభాస్ స్పీచ్ ముగిసిన తర్వాత వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై కూడా వివరణ ఇచ్చాడు. మరొక విలేకరి ట్రోలింగ్స్ గురించి అడగడంతో నెక్స్ట్ కంటెంట్ తప్పకుండా హెవీగా ఉంటుంది అని ఏదో చిన్నది మిస్ అయ్యాము అని ప్రభాస్ చాలా నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. మరి ఆదిపురుష్ నెక్స్ట్ అప్డేట్ తో అంచనాలను మరో లెవల్ కు తీసుకు వెళుతుందో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.