మీమ్ : నేనే కన్ఫ్యూజన్ లో.. కృతి సనన్ తో అఫైర్ పై ప్రభాస్ రియాక్షన్

Tue Nov 29 2022 15:19:04 GMT+0530 (India Standard Time)

Meme: Prabhas reaction on affair with Kriti Sanon

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ దావన్ సరదాగా చేశాడో.. లేదా సీరియస్ గానే చేశాడో కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశం అయ్యాయి. కృతి సనన్ మీ జాబితాలో ఎందుకు లేదు అంటూ కరణ్ జోహార్ అడిగిన సమయంలో ఆమె ప్రస్తుతం మరొకరి హృదయంలో ఉంది.. ఆమె మనసు దోచుకన్న వాడు ప్రస్తుతం దీపిక పదుకునేతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.వరుణ్ దావన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభాస్ చుట్టు సందడి చేస్తున్నాయి. ఎందుకంటే దీపిక పదుకునే ప్రస్తుతం ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా షూటింగ్ జరుగుతుంది. కనుక వరుణ్ చెప్పినట్లుగా ప్రభాస్ హృదయంలో కృతి సనన్ ఉందా అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

అయితే వీటన్నింటికి దూరంగా ఉండే ప్రభాస్ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం బాలీవుడ్ మీడియా కథనాలపై మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ మీడియా కథనాలకు ప్రభాస్ ఫ్యాన్స్ ఫన్నీగా ఉన్నాయి అంటూ నవ్వుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఈ మీమ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ మీడియా కు చెందిన వారు డార్లింగ్ మీరు నువ్వు కృతి ప్రేమలో ఉన్నట్లుగా మేము విన్నాము. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటీ.. మీ ఇద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారా అన్నట్లుగా మీమ్ ను క్రియేట్ చేశారు.

అప్పుడు ప్రభాస్ సమాధానంగా రేయ్.. అసలు నేను ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. మధ్య లో మీరంతా ఏంట్రా ఈ రచ్చ అన్నట్లుగా మీమ్ లో ఫన్నీగా రాసుకొచ్చారు.

మీమ్ లో ఉన్నది నిజమే.. ప్రస్తుతం ఒక్క సినిమా అని కాకుండా రెండు రోజులు అక్కడ ఉంటే రెండు రోజులు ఎక్కడో అన్నట్లుగా షూటింగ్ చేస్తున్నాడు. కనుక వరుణ్ దావన్ అన్నది ప్రభాస్ గురించి అయ్యి ఉండక పోవచ్చు. ప్రభాస్ మరియు కృతి సనన్ ల కాంబోలో సినిమా రాబోతుంది. కనుక ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉండే అవకాశం లేకపోలేదు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. అసలు విషయం ఏంటో ఆ కృతి కానీ ప్రభాస్ కానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.