Begin typing your search above and press return to search.

500కోట్ల‌తో ప్రాజెక్ట్ -కె .. దీపిక విల‌న్ గా న‌టిస్తుందా?

By:  Tupaki Desk   |   31 July 2021 5:21 AM GMT
500కోట్ల‌తో ప్రాజెక్ట్ -కె .. దీపిక విల‌న్ గా న‌టిస్తుందా?
X
ప్ర‌భాస్ - నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో ప్రాజెక్ట్ -కె పాన్ ఇండియా కేట‌గిరీలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిన‌దే. ఈ సినిమాకోసం వైజ‌యంతి మూవీస్ 500కోట్ల మేర బ‌డ్జెట్ ని కేటాయించ‌నుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ఇటీవ‌ల రామోజీ ఫిలింసిటీలో నిర్మించిన సెట్లో ఆయ‌న చిత్రీక‌ర‌ణ కోసం హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం అమితాబ్ పై స‌న్నివేశాల‌ను ప్రారంభించారు. ఇంకా ఆర్.ఎఫ్‌.సి లో భారీ సెట్ల నిర్మాణం సాగుతోంది. 90శాతం షూటింగ్ ఈ సెట్ల‌లోనే పూర్తి చేసి భారీగా విజువ‌ల్ గ్రాఫిక్స్ ని జోడించాల్సి ఉంటుంద‌ని నాగ్ అశ్విన్ బృందాలు చెబుతున్నాయి. ఇక ఈ మూవీలో కేవ‌లం గ్రాఫిక్స్ వీఎఫ్ ఎక్స్ కోస‌మే 200కోట్ల బ‌డ్జెట్ వెచ్చిస్తార‌న్న టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ నుంచి అవతార్ స‌హా ఎన్నో గొప్ప చిత్రాల‌కు ప‌ని చేసిన టెక్నీషియ‌న్ల‌ను బ‌రిలో దించే ఆలోచ‌న‌లో ఉన్నారు.

ఇక ఈ మూవీలో న‌టిస్తున్న దీపిక ప‌దుకొనే పాత్ర చిత్ర‌ణ‌పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దీపిక ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర‌లో న‌టించ‌నుంది?  ప్ర‌భాస్ కి ధీటుగా ఈ పొడుగుకాళ్ల సుంద‌రి యాక్ష‌న్ క్వీన్ గా న‌టిస్తుందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే దీపిక‌ప‌దుకొనే ఇప్ప‌టికే త‌న ప‌నిని ప్రారంభించారు. ప్రాజెక్ట్ -కెలో త‌ను కొత్త లుక్ తో ట్రిమ్ గా స్లిమ్ గా క‌నిపించాలి. పైగా యాక్ష‌న్ ఎపిసోడ్స్ కి త‌గ్గ‌ట్టు త‌న బాడీ లాంగ్వేజ్ ని మార్చుకోవాల్సి ఉంటుంద‌ట‌. ప‌ద్మావ‌త్ చిత్రంలో ఎంతో బ‌ల‌మైన వ్య‌క్తిత్వం ఉన్న రాణిగా ఎంతో గొప్ప‌గా న‌టించారు. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో దీపిక క‌నిపించే వీలుంద‌ని అంచ‌నా. టాలీవుడ్ లో అడుగుపెడుతూ ఆరంగేట్ర‌మే దీపిక అద‌ర‌గొట్ట‌బోతోంది. ఆమె పాత్ర ఏమిట‌న్న‌ది ఇప్ప‌టికీ రహస్యంగా ఉంచినా అభిమానులు మాత్రం ర‌క‌ర‌కాలుగా ఊహాగానాలు సాగిస్తున్నారు.

నాయ‌కానాయిక‌ల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ‌:
ఇక గ్రీన్ మ్యాట్ బ్లూమ్యాట్ వ‌ర్చువ‌ల్ టెక్నాల‌జీల‌తో ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ తెర‌కెక్క‌నుండ‌గా దీపిక .. ప్ర‌భాస్ స‌హా టీమ్ కి కొంత ట్రైనింగ్ ఉంటుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌భాస్ ఇప్ప‌టికే సాంకేతిక‌త‌తో ప‌ని చేసి ఉన్నారు. మ‌రింత‌గా అవ‌గాహ‌న పెంచుకుంటున్నారు.

దీపిక కఠోర శిక్ష‌ణ‌:

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ #ప్రాజెక్ట్ K  లో దీపికా పదుకొనే ప్రభాస్ తో రొమాన్స్ చేస్తోంది. ఈ మూవీతో పాటు షారూక్- పఠాన్ - శకున్ బాత్రా ప్రాజెక్ట్ - హృతిక్ తో భారీ చిత్రంలోనూ దీపిక న‌టించ‌నుంది. దీని కోసం ఆమె ఏకకాలంలో ముంబై - హైదరాబాద్ మధ్య షూటింగ్ ల కోసం ప్ర‌యాణాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇంత‌టి ప్యాక్డ్ షెడ్యూల్ ఉన్నా కానీ దీపిక తన వ్యాయామ సెష‌న్ల‌ను డైట్ ని ఏమాత్రం మిస్స‌వ్వ‌దు.

వ్యాయామం మిస్ కాదు:

దీపిక‌ జిమ్ లో తన శిక్షణ కోసం రోజుకు గంట‌న్న‌ర స‌మ‌యం గ‌డుపుతోంద‌ట‌. వారానికి ఆరు రోజులు ఇలా చేస్తోంది. విశ్రాంతి కోసం ఒక రోజు గ్యాప్ ఇస్తుంది. దీపిక‌ వ్యాయామంలో యోగా.. క్రియాత్మక ఆత్మ‌ప‌రిశీల‌న‌ శిక్షణతో సమ్మేళనంగా ఉంటుంది.  

రాధేశ్యామ్ రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌

ఈ ఏడాది ఎంత‌గానో వేచి చూసిన `రాధేశ్యామ్` క‌రోనా క్రైసిస్ వ‌ల్ల రిలీజ్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మైంది. 2021 సంక్రాంతి .. స‌మ్మ‌ర్ రిలీజ్ అంటూ ప్ర‌చారం సాగినా అది వీలుప‌డ‌లేదు. ఎట్ట‌కేల‌కు పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియాలో ఈ చిత్రం రిలీజ్ తేదీతో పోస్టర్ ను పంచుకున్నారు. ఇందులో డార్లింగ్ యూరోప్ వీధుల్లో నడుస్తూ కనిపిస్తున్నారు. ఈ చిత్రం మకర సంక్రాంతి (పొంగల్) సందర్భంగా విడుదలవుతుంద‌ని ప్ర‌భాస్ ప్ర‌క‌టించారు. 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కానుందని టీమ్ అధికారికంగా వెల్ల‌డించింది. ఇంత ఆల‌స్యం అభిమానులు ఊహించ‌నిది.