ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ ఫిలింగా నిలవనున్న ప్రభాస్ మూవీ...!

Wed Oct 21 2020 12:40:30 GMT+0530 (IST)

Prabhas movie is the highest budget film in India

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. ఇటీవలే ఈ భారీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటించనున్నాడని మేకర్స్ ప్రకటించారు. లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ ఈ చిత్రానికి మెంటర్ గా వ్యవహరించనున్నాడు. త్వరలోనే మరికొంత మంది స్టార్స్.. స్టార్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్టులోకి రాబోతున్నారని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్టింగ్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించాలని నిర్ణయించుకున్నారు.ఇది ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మితమవుతున్న సినిమాగా నిలుస్తుందని ప్రొడ్యూసర్ అశ్వినీదత్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి మినిమమ్ బడ్జెట్ 450 కోట్లుగా అనుకుంటున్నట్లు తెలిపాడు. అది 600 కోట్ల వరకు అవ్వొచ్చని అనుకుంటున్నారు. గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న సినిమా కావడంతో అంత బడ్జెట్ అవసరం కానుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో జనవరి 21న ప్రారంభిస్తామని.. టాకీ పార్ట్ కి సుమారు ఏడాది సమయం పడుతుందని.. పోస్ట్ ప్రొడక్షన్ కి మరో ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉందని.. 2022 సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్స్ చేసుకుంటున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కు సంబంధించి మరికొన్ని విషయాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.