'బాహుబలి' 'పుష్ప' ఫార్మాట్ లో ప్రభాస్ మూవీ

Sat Jan 29 2022 13:25:25 GMT+0530 (IST)

Prabhas movie in Bahubali Pushpa format

`బాహుబలి` తరువాత తెలుగు సినిమా స్థాయి పూర్తి గా మారిపోయింది. తెలుగు లో స్టార్ హీరో సినిమా వచ్చేస్తోందంటే అది పాన్ ఇండియా స్థాయి సినిమాగానే చూస్తున్నారు. మేకింగ్ స్టైల్ కూడా ప్రారంభం నుంచి అదే ఫార్మాట్ ని అనుసరిస్తుండటంతో మన సినిమాలు పాన్ ఇండియా స్టాయిలో సంచలనాలు సృస్టిస్తున్నాయి. దీంతో మన స్టార్ లు కూడా తమ సినిమాలని ఆ స్థాయిలోనే తెరపైకి తీసుకొస్తున్నారు. అంతే కాకుండా బాహుబలి కేజీఎఫ్ చిత్రాల తరువాత కూడా రెండు బాగాలుగా సినిమాలు చేయడం అనేది ట్రెండ్ గా మారింది.`బాహుబలి` రెండు బాగాలుగా తెరకెక్కి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే పంథాను ఫాలో అవుతూ చేసిన `కేజీఎఫ్`కి సంబంధించిన పార్ట్ 2 త్వరలో రాబోతోంది. ఇక `పుష్ప` కూడా రెండు భాగాలు కాగా పార్ట్ 2 షూటింగ్ ఫిబ్రవరి లేదా మార్చిలో మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఇదే ఫార్మాట్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ తెరపైకి రాబోతోందని తెలిసింది. అదే `సలార్`. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. `కేజీఎఫ్ ` తరహాలోనే `సలార్` కూడా రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
 
కోల్ మైన్ నేపథ్యంలో సాగే హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. అయితే కథ డిమాండ్ మేరకు దీనిని రెండు భాగాలుగా చేస్తేనే బాగుంటుందని భావించిన హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ టూ పార్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ చిత్రంలో ప్రభాస్ ఇంటెన్స్ లుక్ తో సరికొత్త మేకోవర్ తో కనిపించనున్న విషయం తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపలిబాబు రాజమానర్ అనే పవర్ ఫుల్‌పాత్రలో కనిపించబోతున్నారు. కోవిడ్‌కారణంగా నిలిచిపోయిన ఈ మూవీ తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతోంది.

విహారానికి యూరప్ ట్రిప్ కి వెళ్లిన ప్రభాస్ ఇటీవల తిరిగి హైదరాబాద్ రావడంతో `సలార్` తాజా షెడ్యూల్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీని రెండు బాగాలు గా చేయబోతున్నారన్న వార్త వైరల్ గా మారింది.