Begin typing your search above and press return to search.

బర్త్‌ డే కు ప్రభాస్‌ ఆ సినిమా అనౌన్స్‌ మెంట్‌ ఇంకా..!

By:  Tupaki Desk   |   28 July 2021 8:47 AM GMT
బర్త్‌ డే కు ప్రభాస్‌ ఆ సినిమా అనౌన్స్‌ మెంట్‌ ఇంకా..!
X
ఈమద్య కాలంలో స్టార్స్ పుట్టిన రోజులు రాబోతున్నాయి అంటే నెల రెండు నెలల ముందు నుండే సందడి వాతావరణం మొదలు అవుతుంది. మా హీరో సినిమాల ఫస్ట్ లుక్‌ లు.. టీజర్ లు ట్రైలర్ లు మేకింగ్‌ వీడియోలు అంటూ చాలా చాలా వస్తాయంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒక్క సినిమా చేస్తేనే ఏదో ఒక పోస్టర్ లేదా టీజర్‌ అదీ కాదంటే మేకింగ్ వీడియోను విడుదల చేస్తారు. అలాంటి ప్రస్తుతం ప్రభాస్ ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఆయన బర్త్‌ డే కు ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్క సినిమా నుండి అభిమానులు అప్‌ డేట్‌ కోరుకుంటున్నారు. అక్టోబర్ లో ప్రభాస్ బర్త్‌ డే సందర్బంగా రాబోతున్న సర్‌ ప్రైజ్ లు ప్రత్యేక కానుకలు పోస్టర్ ల గురించి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు అభిమానుల్లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

బర్త్‌ డే సందర్బంగా ప్రభాస్‌ నటిస్తున్న రాధే శ్యామ్‌.. సలార్‌.. ఆదిపురుష్‌ ఇంకా ప్రాజెక్ట్‌ కే కు సంబంధించిన అప్‌ డేట్స్‌ వీడియోస్ లేదా ఫొటోస్‌ ఏదో ఒక విధంగా నాలుగు సినిమాల సందడి ఉంటుంది. ఇవి కాకుండా మరో ప్రత్యేకమైన ఒక అనౌన్స్‌ మెంట్‌ వస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్బంగా ఆయన బాలీవుడ్‌ చేయబోతున్న రెండవ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను తన అన్ని సినిమాలతో దక్కించుకుంటాడు అంటూ ప్రభాస్ అభిమానులు అంతా నమ్మకంగా ఉన్నారు. అలాంటి సమయంలో బాలీవుడ్‌ స్టార్‌ కమర్షియల్‌ దర్శకుడు సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు కనుక ఆ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రూ.250 కోట్లతో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను హిందీలో నిర్మించేందుకు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ మొదలు పెట్టింది. ఈ ఏడాది చివరి నుండి పట్టాలెక్కబోతున్న ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా అనౌన్స్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తానికి ప్రభాస్‌ బాలీవుడ్‌ లో ఆదిపురుష్‌ తో మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించబోతున్నాడు. అయితే ఆది పురుష్‌ లో ఎక్కువగా మోషన్‌ గ్రాఫిక్స్ ఉంటుందని అంటున్నారు. కనుక ఆ సినిమా కంటే ప్రభాస్‌ తదుపరి సినిమా సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు కనుక దానిపై ఎక్కువ ఫోకస్ ఉంటుందని అంటున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభాస్ నుండి ముందు ముందు వచ్చేవన్ని కూడా అద్బుతాలే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లతో బిజీగా ఉన్న ప్రభాస్‌ బర్త్‌ డే సందర్బంగా ఏమైనా పెళ్లి ప్రకటన కూడా వస్తుందేమో చూడాలి.

ప్రభాస్‌ తన 42 వ పుట్టిన రోజు సందర్బంగా పలు సినిమాల సర్‌ ప్రైజ్ లు వస్తాయి అందులో ఎలాంటి డౌట్ లేదు. కొత్త సినిమాల ప్రకటనలు కూడా వస్తాయి. కాని ప్రభాస్‌ కొత్త సినిమాకు సంబంధించిన అప్‌ డేట్స్ తో పాటు ఆయన పెళ్లికి సంబంధించిన ఏదైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అంటూ ఉన్నారు. నాలుగు పదుల వయసులో ఎంటర్ అయ్యి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది కనుక ప్రభాస్ ఇంకా ఆలస్యం చేయడం సబబు కాదు అని కొందరు అభిమానులు అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అభిమానులకు కిక్‌ ఇస్తే ఆయన పెళ్లి వార్త ఆనందాన్ని ఇస్తుంది. మరి ప్రభాస్ ఆ విషయాన్ని తన బర్త్‌ డే సందర్బంగా అయినా ప్రకటిస్తాడా అనేది చూడాలి.