ఒక్కో ఫొటోలో ఒక్కో విధంగా.. హాట్ టాపిక్ గా ప్రభాస్ లుక్స్..!

Tue Jun 28 2022 13:05:25 GMT+0530 (IST)

Prabhas looks like a hot topic in every photo

'బాహుబలి' సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాందించుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ప్రభాస్ సినిమాలతో పాటుగా అతని లుక్స్ పై ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.'సాహో' సినిమా తర్వాత ప్రభాస్ లుక్స్ లో చాలా వెరీయేషన్స్ కనిపించాయి. 'రాధేశ్యామ్' లో అతని లుక్స్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ సమయంలో నార్త్ ఆడియన్స్ డార్లింగ్ లుక్ పై తీవ్ర విమర్శలు చేశారు. దాదాపు 50 ఏళ్ల అంకుల్ లా కనిపిస్తాడని.. మేకప్ లేకుండా అతన్ని చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉందని ట్రోల్ చేసారు.

మిల్క్ మ్యాన్ లా ఉండాల్సిన వ్యక్తి.. ఏజ్ మీదపడిన వ్యక్తిలా కనిపిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ప్రభాస్ లుక్ అస్సలు బాగోలేదని.. అతను తన ఆరోగ్యం మీద ఫిట్ నెస్ పై శ్రద్ద పెడితే బావుంటుందని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ నివాసంలో జరిగిన గెట్-టుగెదర్ పార్టీలో ప్రభాస్ క్లాస్ లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

చెక్ షర్ట్ ధరించి తలకు క్యాప్ పెట్టుకొని బియర్డ్ లుక్ లో ఎంతో హ్యాండ్సమ్ గా లీన్ లుక్ లో కనిపించాడు ప్రభాస్. డార్లింగ్ ముఖంలో మునుపటి కళ కనిపిస్తుందని.. ఇంకొంచెం కష్టపడితే ఒకప్పటి రూపానికి వచ్చేస్తాడని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఏదేమైనా ప్రభాస్ మళ్లీ ఫిట్ నెస్ మీద శ్రద్ద పెట్టినట్లు కనిపిస్తుందని సంతోషించారు. అయితే ఇంతలోనే యంగ్ రెబల్ స్టార్ చిత్రమైన గెటప్ లో విచిత్రంగా కనిపించి షాక్ ఇచ్చారు.

'ప్రాజెక్ట్ K' షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన అమితాబ్ బచ్చన్ ను ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు కలిశారు. వీరిలో హీరో ప్రభాస్ కు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. ఇందులో ప్రభాస్ లూజ్ గా ఉండే సాధారణ దుస్తులు ధరించి ఎప్పటిలాగే కనిపించారు. వారం గ్యాప్ లోనే రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించడంతో అతని లుక్స్ విషయంలో ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు.

ఆఫ్ స్క్రీన్ లో ఉబర్ లుక్ లో కనిపించారని సంబరపడే లోపే ఇలా మళ్లీ అతని ట్రోలింగ్ లుక్ అభిమానులను కలవరపెడుతోంది. అలానే డార్లింగ్ స్టైలింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంపై వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. లుక్ తో పాటుగా అతను ధరించిన దుస్తులు కూడా ట్రోలింగ్ కు గురవుతుండటం వారిని భాదిస్తోంది.

నిజానికి ప్రభాస్ పదేళ్ల క్రిందట కఠినమైన వర్కవుట్స్ చేస్తూ.. రోజులో కనీసం రెండు మూడు గంటలు జిమ్ లోనే గడిపేవారు. కానీ ఆ తర్వాత అతని బాడీలో వచ్చిన మార్పులు చూసి ఫిట్ నెస్ మీద శ్రద్ధ పెట్టలేదేమో అనిపిస్తుంది. చాలా సందర్భాలలో డార్లింగ్ ఆఫ్-స్క్రీన్ లుక్స్ అభిమానులను పూర్తిగా నిరాశపరుస్తోంది.

ఇకనైనా ప్రభాస్ నిజజీవితంలో ఎలా ఉండాలనే దానిపై సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఒకప్పటి చురుకైన రూపాన్ని పొందడానికి కష్టపడాల్సి ఉందని అంటున్నారు. మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ ను మన్నించి డార్లింగ్ ఫిట్ నెస్ మరియు బాడీ మీద ఫోకస్ పెడతారేమో చూడాలి.