Begin typing your search above and press return to search.

ఈ విషయంలోనూ ప్రభాస్‌ సౌత్‌ లో నెం.1

By:  Tupaki Desk   |   27 Sep 2020 5:10 AM GMT
ఈ విషయంలోనూ ప్రభాస్‌ సౌత్‌ లో నెం.1
X
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ ఆల్‌ ఇండియాకు పాకింది. ఆయన బాలీవుడ్‌ స్టార్‌ హీరోలను సైతం క్రాస్‌ చేసి బాహుబలి మరియు సాహో సినిమాలతో వసూళ్లు దక్కించుకున్నాడు. ప్రభాస్‌ కు సౌత్‌ లోనే కాకుండా ఉత్తరాదిలో కూడా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ప్రభాస్‌ కొత్త సినిమా కోసం ఉత్తరాది ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్‌ కు ఆ క్రేజ్‌ తో సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్‌ సంఖ్య పెరిగి పోయింది. ఎంతగా అంటే సౌత్‌ ఇండియాలో ఏ స్టార్‌ హీరోకు లేనంతగా ఫాలోయింగ్‌ దక్కింది.

ప్రభాస్‌ ఫేస్‌ బుక్‌ పేజీకి ఫాలోవర్స్‌ సంఖ్య 20 మిలియన్‌ లు దాటింది. సౌత్‌ లో ఏ స్టార్‌ హీరో ఫేస్‌ బుక్‌ పేజీ కూడా ఈ స్థాయిలో ఫాలోవర్స్‌ ను కలిగి లేదు. ప్రభాస్‌ కు ఉత్తరాదిన ఉన్న క్రేజ్‌ కారణంగా ఈ స్థాయిలో ఫాలోవర్స్‌ ను కలిగి ఉన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన స్టార్‌ డం తో ప్రభాస్‌ రేంజ్ ఎక్కడికో వెళ్లింది. ఆయన స్థాయి ఉత్తరాదిన కూడా వందల కోట్లల్లో ఉంది. పైగా ఈయన డైరెక్ట్‌ హిందీ సినిమా ఆదిపురుష్‌ ను చేయబోతున్నాడు. ఆ సినిమాతో మరింతగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆది పురుష్‌ విడుదలైన తర్వాత ప్రభాస్‌ కు ఉత్తరాదిన మరింతగా స్టార్‌ డం దక్కడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.