పృథ్వీరాజ్ వీడియోలు షేర్ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

Tue Jun 28 2022 11:06:26 GMT+0530 (IST)

Prabhas fans sharing Prithviraj videos

బాహుబలి సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సినిమా సినిమాకు ఫ్యాన్స్ లో అంచనాలు పెరుగుతున్నాయి. కాని ఆయన సాహో.. రాధేశ్యామ్ సినిమాలు బొక్క బోర్లా పడటంతో ముందు ముందు ఏం జరుగుతుందో అనే టెన్షన్ తో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు అయిదు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో కొన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయినా కూడా అందరి దృష్టి సలార్ పైనే ఉంది.వచ్చే ఏడాది ఆరంభం లో విడుదల కాబోతున్న సలార్ సినిమా తో కేజీఎఫ్ రేంజ్ లో సక్సెస్ ను ప్రభాస్ దక్కించుకుంటాడనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్ 2 సినిమా ప్రమోషన్ సమయంలో సలార్ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎక్కువగా మాట్లాడేందుకు నిరాకరించాడు. రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా ప్రభాస్ సలార్ గురించి ఎక్కువ మాట్లాడలేదు.

సలార్ యొక్క పరిస్థితి ఏంటీ.. అసలు ఆ సినిమా ఎలా ఉండబోతుంది అంటూ చాలా మంది చాలా రకాలుగా ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా హైదరాబాద్ లో మాట్లాడుతూ సలార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా రోజుల ముందు ప్రశాంత్ నీల్ సలార్ సినిమా లో నటించాల్సిందిగా అడిగాడు.

ఆ సమయంలో తాను బిజీగా ఉండటం వల్ల డేట్లు కుదరవని చెప్పాను. కాని అనూహ్యంగా సలార్ సినిమా ఆలస్యం అవ్వడంతో మళ్లీ తన వద్దకు ఆఫర్ రావడం.. అది కూడా ప్రభాస్ నన్ను అడటంతో ఓకే చెప్పాను అంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో సలార్ గురించి ఆయన మాట్లాడుతూ.. ఒక అద్బుతమైన కథ అంటూ చెప్పుకొచ్చాడు. ఒక దర్శకుడిని అయిన తాను ఎప్పుడెప్పుడు సలార్ ను స్క్రీన్ మీద చూడాలా అని ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

సలార్ గురించి పృథ్వీరాజ్ సుకుమార్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. సలార్ గురించి కొంత మందిలో ఉన్న అనుమానాలకు పృథ్వీరాజ్ వ్యాఖ్యలు సమాధానం అన్నట్లుగా ప్రభాస్ ఫ్యాన్స్ సదరు వీడియోలను పంచుకుంటున్నారు. సలార్ సినిమా లో పృథ్వీరాజ్ పాత్ర ఏంటీ అనే విషయం లో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఆయన మాటలను బట్టి చూస్తూంటే సలార్ మరో కేజీఎఫ్ 2 అయ్యేలా ఉందంటూ ప్రభాస్ అభిమానులు చర్చించుకుంటున్నారు. సలార్ లో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్ 2 వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో సలార్ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో సలార్ ను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.