కుర్ర హీరోయిన్ ని ఆట పట్టించిన ప్రభాస్ ఫ్యాన్

Sat Jan 23 2021 20:00:01 GMT+0530 (IST)

Prabhas fan who played the heroine

నందిత శ్వేత .. పరిచయం అవసరం లేని పేరు ఇది. నిఖిల్ సరసన `ఎక్కడికిపోతావు చిన్నవాడా?` చిత్రంలో నటించింది. ఆత్మ ఆవహించిన ప్రేయసిగా భీభత్స రసం అద్భుతంగా పండించింది. ఈ హారర్ మూవీ హిట్టవ్వడంతో ఆ క్రేజు ఈ అమ్మడికి ఏకంగా అరడజను అవకాశాల్ని తెచ్చింది. `ప్రేమకథా చిత్రమ్ 2`లోనూ ఈ భామ కథానాయిక గా నటించింది.అయితే నందిత ఇటీవల టాలీవుడ్ సర్కిల్స్ లో అంతగా కనిపించడం లేదు. అప్పట్లో `బ్లఫ్ మాస్టర్` రిలీజ్ ప్రమోషన్స్ లో సందడి చేసింది. కరోనా  క్రైసిస్ వేళ పెద్దగా జాడ లేదు. ఆ తర్వాత కన్నడలోనూ ప్రయత్నించింది. అక్కడ కేజీఎఫ్  స్టార్ యశ్ సరసన ఓ సినిమాకి ఛాన్సొచ్చింది. కన్నడలో అత్యంత భారీగా ఈ చిత్రం తెరకెక్కుతుందన్న ప్రచారం సాగింది.

లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సర్ ప్రైజ్.. నో మోర్ టెంపరరీ పీపుల్ అంటూ ట్విట్టర్ లో రకరకాల కొటేషన్లతో అభిమానులకు టచ్ లో ఉంది. ఈ కొటేషన్ కి ప్రభాస్ అభిమాని స్పందించాడు. ప్రభాస్ సలార్ లో సెలెక్టయ్యావా? అందుకేనా ఫుల్ ఆఫ్ సర్ ప్రైజ్ అంటూ ఆటపట్టించాడు. వేరొక అభిమాని బ్రేకప్పా.. ప్యాచప్పా? అంటూ కూడా ప్రశ్నించాడు.

నందిత షేర్ చేసిన తాజా ఫోటో సంథింగ్ హాట్ గా ఎంతో బ్యూటిఫుల్ గా ఆకర్షిస్తోంది. ఆ అందమైన భుజాలను ఎంతగా దాచాలనుకున్నా దాగడం లేదు. అంత లూజ్ గా టాప్ ని డిజైన్ చేసి టాప్ లేపాడు ఆ డిజైనర్ బ్రహ్మ. ఎంత జారవిడిచినా అంత అందంగా కనిపిస్తోంది అమ్మడు. సంథింగ్ హాట్ గానూ ఎలివేట్ అవుతోంది. ఇలాంటి కొత్త ప్రయత్నాలతో దర్శకనిర్మాతల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.