సలార్ కోసం సన్నబడితే 'ప్రాజెక్ట్ కే' పరిస్థితి...!

Tue May 17 2022 11:00:01 GMT+0530 (IST)

Prabhas Upcoming Movies

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల సంఖ్య చాలా పెద్దదే. ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు సిద్ధం అవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆదిపురుష్ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. మరో వైపు ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ ను దాదాపుగా 30 శాతం వరకు పూర్తి చేశాడు. కేజీఎఫ్ 2 హడావుడిలో ఉన్న ప్రశాంత్ నీల్ త్వరలోనే సలార్ షూటింగ్ ను పునః ప్రారంభించబోతున్నాడు.సలార్ షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ కే షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు ప్రాజెక్ట్ కే షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన విషయం తెల్సిందే. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే షూటింగ్ 30 నుండి 40 శాతం వరకు పూర్తి అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.

ఈ సమయంలో ప్రభాస్ సలార్ సినిమా కోసం వెయిట్ తగ్గుతున్నాడంటూ సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సలార్ లో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని... మొదటి పాత్ర ను ప్రభాస్ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు చిత్రీకరించారు... రెండవ పాత్రను వెయిట్ లాస్ అయ్యాక చిత్రీకరించాలని భావిస్తున్నారంటూ ఆ వార్తల సారాంశం.

ప్రభాస్ సలార్ సినిమా కోసం వెయిట్ తగ్గితే ఇప్పటికే ప్రారంభం అయిన ప్రాజెక్ట్ కే లో వేరియేషన్స్ తో కనిపిస్తాడు కదా అనే అనుమానం వ్యక్తం అవుతుంది.

ప్రాజెక్ట్ కే షూటింగ్ ను కూడా సలార్ కు సమాంతరంగా కొనసాగిస్తున్నారు. కనుక సలార్ కోసం వెయిట్ తగ్గితే ప్రాజెక్ట్ కే పై ఆ ప్రభావం పడుతుంది కదా అనేది చాలా మంది అనుమానం.

సలార్ సినిమా లో రెండు రకాల పాత్రలు కనుక వెయిట్ ఎక్కువ తక్కువగా కనిపించినా పర్వాలేదు. ప్రాజెక్ట్ కే లో ఒకే పాత్ర రెండు రకాల బాడీ తో కనిపిస్తే ఏం బాగుంటుంది అనేది కొందరి అభిప్రాయం. దీంతో ప్రభాస్ వెయిట్ లాస్ న్యూస్ పుకార్లే అయ్యి ఉంటాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది ప్రభాస్ సన్నిహితులు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.