సాహో స్టీరింగ్ ప్రభాస్ చేతిలోనే ఉందట!

Sun May 19 2019 19:20:54 GMT+0530 (IST)

Prabhas Take Care Of about Sahoo Movie

బాహుబలి' తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియన్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ నటించే సినిమాల రేంజ్ కూడా దానికి తగ్గట్టు ఉండాలనే ఉద్దేశంతో భారీ బడ్జెట్లతో నిర్మిస్తున్నారు.  ప్రభాస్ నెక్స్ట్ ఫిలిం 'సాహో' విషయానికి వస్తే 250 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోంది.  అయితే మనకు టాలీవుడ్ లో ఈ రేంజ్ బడ్జెట్ ను హ్యాండిల్ చేసిన దర్శకులు రాజమౌళి తప్ప మరొకరు లేరు. దీంతో దర్శకుడు సుజిత్ కు యూవీ క్రియేషన్స్ వారి నుంచే కాకుండా ప్రభాస్ నుండి భారీ సపోర్ట్ అందుతోందట.సుజిత్ ఇప్పటివరకూ చేసింది ఒక సినిమానే అది కూడా స్మాల్ బడ్జెట్ ఫిలిం.. దీంతో ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించిన సినిమాకు సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ప్రభాస్ తీసుకుంటున్నాడట. సహజంగా ఒక సినిమాకు డైరెక్టర్ ఫైనల్ డెసిషన్ కోసం హీరో పైనో.. నిర్మాత పైనో ఆధారపడితే నెగెటివ్ బజ్ వస్తుంది.  కానీ ఈ సినిమా విషయంలో అలాంటిది. లేకపోవడం గమనార్హం.  సుజిత్ కు పెద్దగా అనుభవం లేకపోవడంతో ప్రభాస్ తన అనుభవంతో సుజిత్ కు సహకారం అందిస్తున్నట్టు ఉంది కానీ ప్రాజెక్టులో అనవసరంగా ఇన్వాల్వ్ అయినట్టు లేదని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం సుజిత్ కు భారీ ఆఫర్లు రావడం ఖాయం.  ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ తమిళం లాంటి పలు ఇతర భాషలలోనూ రిలీజ్ అవుతోంది కాబట్టి ఒక్కసారిగా బిగ్ లీగ్ డైరెక్టర్ల సరసన చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చూద్దాం..ఏం జరుగుతుందో.