గ్రేటెస్ట్ డైరెక్టర్ సుజీత్ ఇంటర్నేషనల్ - ప్రభాస్

Sun Aug 18 2019 23:30:09 GMT+0530 (IST)

Prabhas Speech at Saaho Pre Release Event

రన్ రాజా రన్` టైమ్ కి దర్శకుడు సుజీత్ వయసు 22. ఆ సినిమాతో హిట్టు కొట్టి `సాహో` పూర్తి చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. అంటే ఇప్పుడు వయసు 26. సాహో ఈనెల 30న రిలీజవుతోంది. అంటే సుజీత్ నాలుగేళ్ల కల ఈ నెలాఖరుతో ఫలించబోతోంది. అందుకే `సాహో` ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రత్యేకించి డార్లింగ్ ప్రభాస్ సుజీత్ గురించి ప్రత్యేకంగా హైలైట్ చేశారు.నిజానికి 22 ఏళ్ల కుర్రాడు చెప్పిన కథను నమ్మి 350 కోట్ల బడ్జెట్ పెట్టే సినిమాకి అవకాశం ఇచ్చాడంటే ప్రభాస్ ని .. తన స్నేహితులు ప్రమోద్ - వంశీ- విక్కీని ఎంత ప్రశంసించినా తక్కువే. ఆ గట్స్ కి మెచ్చుకుని తీరాలి. అందుకే వేదికపై అల్లు అరవింద్ - కృష్ణంరాజు సహా ఎందరో సుజీత్ పైనా.. నిర్మాతలు ప్రమోద్ - వంశీ- విక్కీ బృందంపైనా ప్రశంసలు కురిపించారు.

డార్లింగ్ ప్రభాస్ మాట్లాడుతూ-``సుజీత్ నాకు కథ చెప్పినప్పుడు 22 ఏజ్. 40 ఏళ్ల అనుభవజ్ఞుడిలా కథను చెప్పాడు. అందుకే అతడికి అవకాశం ఇచ్చాను. సాహో చిత్రాన్ని చాలా గొప్పగా తీశాడు. సుజీత్ గ్రేటెస్ట్ డైరెక్టర్. ఇంటర్నేషనల్ అయిపోతాడేమో. థాంక్యూ సుజీత్. సెట్స్ లో అందరూ సీనియర్లే. సాబు- శ్రీకర్- కెన్నీ అందరూ సీనియర్లే. వీళ్ల తో ఎలా పని చేస్తాడో అనుకుంటే ఎంతో అనుభవజ్ఞుడిలా అందరితో ఔట్ పుట్ తీసుకున్నాడు. నాలుగేళ్ల పాటు ఈ సినిమా కోసమే శ్రమించాడు`` అంటూ ప్రశంసలు కురిపించాడు. తన స్నేహితుల గురించి డార్లింగ్ ప్రభాస్ అంతే ఇదిగా ప్రశంసలు కురిపించారు.