ప్రభాస్ స్పెషల్ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు?

Sun Jun 26 2022 21:00:01 GMT+0530 (India Standard Time)

Prabhas Special Party

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. రికార్డు స్థాయిలో మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టిన ప్రభాస్ ఇప్పటికే ఓ భారీ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు. ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ `ఆది పురుష్`. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో జపాన్ మూవీ స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.ప్రస్తుతం `కేజీఎఫ్` కేజీఎఫ్ 2 ఫ్రాంచైజీలతో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా స్థాయి బ్లాక్ బస్టర్ అని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ తో `సలార్` `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో `ప్రాజెక్ట్ కె`. లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు భారీ ప్రాజక్ట్ లు షూటింగ్ దశలో వున్నాయి. గత కొన్ని రోజులుగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న `ప్రాజెక్ట్ కె` చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.  

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. క్రేజీ లేడీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. `ఆదిత్య 369` తరహాలో హిమాలయాల్లో సాగే టైమ్ ట్రావెల్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి. అశ్వనీదత్ స్వప్న దత్ నిర్మిస్తున్నారు. ఇటీవలే కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేశారు. దీపికా పదుకునే కు అస్వస్థతకు గురి కావడం హార్ట్ బీట్ లో తేడా రావడంతో షూటింగ్ కి బ్రేకిచ్చారని ప్రచారం జరిగింది.

అయితే దీపిక కోలుకున్న వెంటనే షూటింగ్ లో పాల్గొందని తాజాగా కీలక షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కీలక షెడ్యూల్ షూటింగ్ పూర్తవడంతో హీరో ప్రభాస్ శనివారం రాత్రి టీమ్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ పార్టీలో అమితాబ్ బచ్చన్ తో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొందని ఇదే పార్టీలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పార్టీలో ప్రభాస్ మాట్లాడుతుండటా అమితాబ్ అక్కడే నిలబడి వున్నారు. ఆయన పక్కనే దుల్కర్ సల్మాన్ తో పాటు నాగ్ అశ్విన్ నిర్మాత సి. అశ్వనీదత్ మూవీ టీమ్ అంతా వుండటం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. `ప్రాజెక్ట్ కె`ని ఈ ఏడాదే పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.