Begin typing your search above and press return to search.

బెబోకి డార్లింగ్ బిరియానీ.. అస‌లు క‌థాకమామీషు వేరే

By:  Tupaki Desk   |   14 Oct 2021 11:30 AM GMT
బెబోకి డార్లింగ్ బిరియానీ.. అస‌లు క‌థాకమామీషు వేరే
X
బెబో క‌రీనాకి డార్లింగ్ ప్ర‌భాస్ బిరియానీ పార్సిల్ పంపించార‌ని.. త‌న ఇంట వండిన‌ నాన్ వెజ్ వంట‌కాలను రుచి చూపించార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. క‌రీనా ఆ వంట‌కాలు రుచి చూసి ప్ర‌భాస్ కి కితాబిచ్చేశారు. ఇక ప్ర‌భాస్ పై ఆదిపురుష్ 3డి కొలీగ్ సైఫ్ అలీఖాన్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించ‌డం తెలిసిందే. అత‌డి హాస్పిటాలిటీ వ్యక్తిత్వానికి సైఫ్ మంత్ర‌ముగ్ధుల‌వ్వ‌డం చూస్తున్న‌దే.

అయితే క‌రీనాకి డార్లింగ్ రుచిక‌ర‌మైన బిరియానీ స‌హా వంట‌కాల్ని పంపించ‌డం వెన‌క అస‌లు క‌థాకమామీషు వేరే ఉంద‌ని తెలిసింది. ప్ర‌భా్ త‌దుప‌రి న‌టించ‌నున్న సినిమాకి బెబో క‌రీనాను క‌మిట్ చేశార‌న్న‌ది తాజా గుస‌గుస‌. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా `అర్జున్ రెడ్డి` ఫేం స‌దీప్ వంగ ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే డార్లింగ్ ని సందీప్ వంగా స్క్రిప్ట్ తో మెప్పించారు. ప్ర‌భాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిన‌ట్లు ప్ర‌చారంలో ఉంది. ప్ర‌భాస్ కెరీర్ 25వ చిత్రమిద‌ని ...`స్పిరిట్` అనే టైటిల్ తో బ‌హుభాషా చిత్రంగా తెర‌కెక్కిస్తున్న‌ట్లు బ‌ల‌మైన ప్ర‌చారం ఉంది.

ఈ చిత్రంలో ప్ర‌భాస్ కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ ని ఒప్పించేందుకు సందీప్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇటీవ‌లే స్క్రిప్ట్ ని క‌రీనాకు వినిపించ‌గా కాన్సెప్ట్ న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. మ‌రి ఈ ప్ర‌చారంలో వాస్త‌వం ఎంతో కాస్త ఆగితే కానీ క్లారిటీ రాదు.

ఇప్ప‌టికే డార్లింగ్ బిరియానీతో పాటు నాన్ వెజ్ వంట‌కాల్ని క‌రీనాకు రుచి చూపించారు. సైఫ్ తోనూ చ‌క్క‌ని స‌త్సంబంధాల‌ను క‌లిగి ఉన్నారు. క‌రీనా క‌పూర్ కి ప్ర‌భాస్ త‌న ఇంటి నాన్ వెజ్ వంట‌కాల్ని ఆమెకి పంపించారు. త‌న కోస్ట‌ర్స్ కి ఇలా నాన్ వెజ్ రుచులు చూపించ‌డం డార్లింగ్ కి ఓ హాబీ అన్న సంగ‌తి విధిత‌మే. ఇటీవ‌లే శ్రుతి హాస‌న్ కి ఇలాంటి ట్రీట్ ఒక‌టిచ్చిన సంగ‌తి తెలిసింద‌. `స‌లార్`లో జోడీగా క‌లిసి న‌టిస్తున్న క్ర‌మంలో ఇది సాధ్య‌మైంది. అంత‌కు ముందు `సాహో` సినిమాలో న‌టించిన‌ శ్ర‌ద్దా క‌పూర్ కి ప్ర‌భాస్ హాస్పిటాలిటీ విప‌రీతంగా న‌చ్చేసింది.

అప్పుడు కూడా ఆన్ సెట్స్ ప్ర‌భాస్ త‌మ ఇంటి రుచుల్ని శ్ర‌ద్దాక‌పూర్ టేస్ట్ చూపించారు. ఇప్పుడు క‌రీనాకి ఆ ఛాన్స్ ద‌క్కింది. త‌న క‌థానాయిక‌లంద‌రికీ డార్లింగ్ ఇలా అడ్వాన్స్ గా వంట‌కాల్ని రుచి చూపిస్తున్నార‌నే భావించాలి. ఇక క‌రీనా భ‌ర్త సైఫ్ అలీఖాన్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న `ఆదిపురుష్` లో రావ‌ణుడి పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సైప్ తో ఉన్న స్నేహం కార‌ణంగాను ప్ర‌భాస్ ఎంతో అభిమానంగా క‌రీనాకు నాన్ వెజ్ ఐట‌మ్స్ పంపించి ఉండొచ్చు. ఏదేమైనా ప్రభాస్- క‌రీనా ఫెయిర్ ఆన్ స్క్రీన్ అదిరిపోతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ వేర్వేరు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఖాన్ ల‌ను కొట్టే రేంజు హీరోగా పాపులారిటీ

దేశంలో అతి పెద్ద ప‌రిశ్ర‌మ బాలీవుడ్ లో అగ్ర హీరో సైఫ్ ఖాన్. అత‌డితో పాటు ఖాన్ ల త్రయం పాల‌న ప్ర‌తిభా పాట‌వాల గురించి తెలిసిన‌దే. పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో వాటాలు..భవిష్య‌త్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని త‌మ గ్రాప్ ని బ‌ట్టి పారితోషికాలను ఖాన్ లు అందుకుంటారు. అమీర్ ఖాన్..స‌ల్మాన్ ఖాన్..షారుక్ ఖాన్.. వీళ్ల కు పోటీగా ఉన్న అక్ష‌య్.. హృతిక్ రోష‌న్ ల‌ది ఓ రేంజు. ఒక్కో సినిమాకు వంద‌ల కోట్లు అందుకుంటున్నారు. ఈ హీరోలంద‌రిని తెలుగు హీరో ప్ర‌భాస్ వెన‌క్కి నెట్టేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ లైన‌ప్ చూస్తే ఈ విష‌యం అర్థ‌మ‌వుతుంది. అత‌డు న‌టిస్తోన్న చిత్రాల‌న్ని పాన్ ఇండియా కేట‌గిరీకి చెందిన‌వే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న `స‌లార్`..బాలీవుడ్ లో ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న `ఆదిపురుష్ 3డి`.. అలాగే రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న `రాథేశ్యామ్`.. నాగ్ అశ్విన్ తో క‌లిసి ప‌నిచేస్తోన్న `ప్రాజెక్ట్ కె` ఇవ‌న్నీ వంద‌ల కోట్ల బ‌డ్జెట్ తోనే తెర‌కెక్కుతున్నాయి. రిలీజ్ అయి స‌క్సెస్ అయితే గ‌నుక ఒక్కో సినిమా వెయ్యి కోట్ల‌కు పైగానే వ‌సూళ్లు సాధించే కంటెంట్ ఉన్న చిత్రాలివి. ప్ర‌స్తుతం సెట్స్ లో ఉన్న సినిమాలు..ప్ర‌భాస్ మార్కెట్ ని బ‌ట్టి చూస్తే ప్ర‌భాస్ ఆదాయం దాదాపు 1500 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

అదే గ‌నుక నిజ‌మైతే ప్ర‌భాస్ మునుముందు ఖాన్ లంద‌రినీ బీట్ చేసిన‌ట్లేనని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ రేంజ్ లో ఆదాయం ఇప్ప‌టివ‌ర‌కూ ఖాన్ ల వ‌ల్ల కూడా కాలేద‌న్న‌ది ఇన్ సైడ్ టాక్ . ఖాన్ ల త్ర‌యం పారితోషికాలు ఇటీవ‌లి కాలంలో పెరిగాయి త‌ప్ప అంత‌కు ముందు ఈ రేంజ్ లో లేవ‌న్న‌ది నిపుణుల మాట‌. మొత్తానికి టాలీవుడ్ హీరో బాలీవుడ్ ని కూడా ఈ ర‌కంగా ఏల్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం చాలా మంది బాలీవుడ్ డైరెక్ట‌ర్లు డార్లింగ్ ప్ర‌భాస్ తో సినిమాలు చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సైఫ్ ఖాన్ తో ప్ర‌భాస్ స్నేహం కూడా ఇప్పుడు అత‌డి రేంజును బాలీవుడ్ లో అమాంతం పెంచేయ‌నుంది. సందీప్ వంగా ప్రాజెక్టుకి క‌రీనా అద‌న‌పు అడ్వాంటేజ్ కానుంది.