Begin typing your search above and press return to search.

`కేజీఎఫ్` కి అమ్మ‌మ్మ‌లాంటి ప్రాజెక్ట్ `స‌లార్`!

By:  Tupaki Desk   |   16 May 2022 11:30 PM GMT
`కేజీఎఫ్` కి అమ్మ‌మ్మ‌లాంటి ప్రాజెక్ట్ `స‌లార్`!
X
`కేజీఎఫ్` ప్రాంచైజీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. భారీ కాన్సాస్ పై తెర‌కెక్కిన ప్రాంచైజీ ఇది. రెండు భాగాలు బాక్సాఫీస్ షేక్ చేసిన చిత్రాలే. కేజీఎఫ్ కాస్టింగ్ ద‌గ్గ‌ర నుంచి టెక్నీషియ‌న్స్..లొకేష‌న్స్...సెట్స్ ఇలా ప్ర‌తీది ఎంతో ఖ‌ర్చుతో కూడుకున్న‌ది. నిర్మాణ ప‌రంగా వంద‌ల‌కోట్లు కేటాయించారంటే మేక‌ర్స్ ప్రాజెక్ట్ ని ఎంత ప్రెస్టీజియ‌స్ గా తీసుకుని తెర‌కెక్కించారో సినిమా చూస్తేనే అర్ధం అవుతుంది.

సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి నిర్మాణం జ‌రిగిన ప్రాజెక్ట్ ఇది. ఔట్ ఫుట్ విష‌యంలో ఏమాత్రం రాజీ ప‌డ‌కుండా ది బెస్ట్ ఇవ్వ‌డానికి టీమ్ ఎంతో శ్ర‌మించింది. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసిన ప్రాజెక్ట్ ఇది. ఆన్ సెట్స్ ని మించిన ఖ‌ర్చు విజువ‌లైజేష‌న్ కోసం హంబోలే ఫిల్మ్స్ కేటాయించింది. అవ‌స‌రం మేర రీషూట్లు. ఇలా ఎన్నో ప్ర‌త్యేక‌తలు క‌ల్గిన ప్రాజెక్ట్ కేజీఎఫ్ ప్రాంచైజీ.

మ‌రి `స‌లార్` ని కేజీఎఫ్ ని మించి తెర‌కెక్కిస్తున్నారా? ఇండియ‌న్ సినిమా స‌హా కేజీఎఫ్ రెండు భాగాల వ‌సూళ్లే టార్గెట్ గా ప్ర‌శాంత్ నీల్ స‌లార్ ని డిజైన్ చేస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తుంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా స‌లార్ సినిమాటోగ్రాఫ‌ర్ భువ‌న గౌడ క‌న్ప‌మ్ చేసారు. కేజీఎఫ్ లో ఏముంది? అంత‌కు మించి స‌లార్ లో ఎగ్జైట్ మెంట్ ఇస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు.

కేజీఎఫ్ ని మించి రెండు..మూడు రెట్లు అధికంగా `స‌లార్` ఉంటుంద‌ని బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్పారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ ఈ విష‌యాలు రివీల్ చేసారు. ఇంకా ఏమ‌న్నారంటే?.. ప్ర‌శాంత్ నీల్ స‌లార్ ని అంత‌ర్జాతీయ ప్రాజెక్ట్ గా మ‌లుస్తున్నారు. మేకింగ్ ప‌రంగా ఎంతో వైవిథ్యం చూపించ‌డానికి నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ షూటింగ్ 30 శాత‌మే పూర్త‌యింది. ఔట్ ఫుట్ బాగా వ‌చ్చింది. బ్యాలెన్స్ అంత‌కు మంచి బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌శాంత్ శ్రమిస్తున్నారు. రేయింబ‌వ‌ళ్లు టీమ్ స‌లార్ కోసం ప‌నిచేస్తుంద‌న్నారు. భువ‌న గౌడ్ మాట‌ల్ని బ‌ట్టి స‌లార్ ని హంబోలే ఫిల్మ్స్ ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుందో అంచ‌నా వేయోచ్చు.

బ‌డ్జెట్ పరంగా 500 కోట్లు దాటే ఉంటుంద‌ని టాక్. ఇప్ప‌టివర‌కూ ఇండియ‌న్ సినిమా బ‌డ్జెట్ 500 కోట్లు దాటింది లేదు. రెండు భాగాల‌కు క‌లిపి ఖ‌ర్చు చేసారు త‌ప్ప‌..ఒకే భాగానికి అన్ని కోట్లు వెచ్చింది లేదు. ఆ లెక్క‌న `స‌లార్` బ‌డ్జెట్ ప‌రంగా రికార్డు ముందే సృష్టించే అవ‌కాశం ఉంది. బ‌హుభాషా చిత్రం..పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ అవుతుంది. ప్ర‌భాస్ ఇమేజ్ న‌డుమ `స‌లార్` బాక్సాఫీస్ టార్గెట్ 2000 కోట్లు అయ్యిండొచ్చ‌ని ఓ అంచ‌నా.