నో డౌట్.. ప్రభాస్ పెర్ఫెక్ట్ పాన్ ఇండియా స్టార్

Tue Sep 17 2019 21:16:34 GMT+0530 (IST)

Prabhas Saaho Movie Collections in Bollywood

డార్లింగ్ ప్రభాస్ ఏ లక్ష్యంతో అయితే `సాహో` చిత్రంలో నటించాడో ఆ లక్ష్యాన్ని అందుకున్నారా?  బాహుబలి తర్వాత అతడిని పాన్ ఇండియా స్టార్ గా పర్మినెంట్ చేయడానికి జరిగిన ప్రయత్నం విజయవంతమైందా? అంటే అవుననే తాజాగా యు.వి.క్రియేషన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.సాహో చిత్రం తెలుగు-తమిళంలో రిజల్ట్ ఎలా ఉంది? అన్నది అలా ఉంచితే.. హిందీ బెల్టులో మాత్రం ఇరగదీసింది. ఈ సినిమా ఇప్పటికే 150 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టి ఇంకా దేశవ్యాప్తంగా చాలా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోందని తెలుస్తోంది. ఉత్తరాదిన ఆదరణ బావుంది కాబట్టే ఆ స్థాయిలో వసూళ్లు సాధించిందని విశ్లేషిస్తున్నారు. దీంతో ప్రభాస్ ని యూనివర్శల్ స్టార్ గా దేశ ప్రజలు అంగీకరించినట్టేనని చెబుతున్నారు.

ఆసక్తికరంగా తెలుగు బెల్ట్ లోనూ కొన్ని ఏరియాల్లో సేఫ్ జోన్ కి వెళుతుండగా.. కొన్నిచోట్ల మాత్రమే నష్టాలు తప్పదని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఆల్మోస్ట్ డౌన్ అయినట్టేనని చెబుతున్నారు. ఓవర్సీస్ లో తీవ్ర నష్టాలు తప్పలేదు. తమిళనాట మాత్రం సాహో ఆశించిన స్థాయిలో ఆడలేదట. అయితే ఓవరాల్ గా ఇప్పటికే 400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి ఇండియా లెవల్లో టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచిందని చెబుతున్నారు. ప్రభాస్ నటించిన బాహుబలి 1.. బాహుబలి 2 తర్వాత `సాహో` ఓవరాల్ గా చెప్పుకోదగ్గ విజయం సాధించిందన్నది చిత్రయూనిట్ చెబుతున్న మాట. అయితే అన్నిచోట్లా పంపిణీదారులు సేఫ్ అన్న మాట వినిపిస్తే అది సిసలైన విజయంగా ప్రూవైనట్టు. డార్లింగ్ ప్రభాస్ వరకూ తన స్టామినాని నిరూపించుకున్నట్టేనన్న చర్చా అభిమానుల్లో సాగుతోంది. ఈ ఉత్సాహంలోనే డార్లింగ్ తదుపరి జాన్ చిత్రంపై దృష్టి సారించనున్నారు.