Begin typing your search above and press return to search.

ప్రభాస్ మళ్లీ రాజా డీలక్స్ లో అడుగు పెట్టేది ఎప్పుడు?

By:  Tupaki Desk   |   7 Feb 2023 8:00 AM GMT
ప్రభాస్ మళ్లీ రాజా డీలక్స్ లో అడుగు పెట్టేది ఎప్పుడు?
X
యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం చాలా సినిమాలకు కమిట్ అయ్యి ఉండి.. అందులో పలు సినిమాలు షూటింగ్‌ దశలో ఉండటంతో ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్‌ లో ప్రభాస్ ఉన్నాడో అర్థం కానీ పరిస్థితి. ఆ మధ్య సలార్ షూట్ లో బిజీగా ప్రభాస్ ఉన్నాడు అనే టాక్ వినిపించింది. ఇప్పుడు ఏ షూట్ లో ఉన్నాడు అనేది స్పష్టత లేదు.

ఈ సమయంలోనే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ గురించి అప్డేట్‌ కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. ఒక వైపు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అవసరమా అంటూనే మరో వైపు ఎప్పుడెప్పుడు ఆ సినిమా వస్తుందా అంటూ ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు.

ఆ మధ్య మారుతి ఒక షెడ్యూల్‌ ను ముగించాడని.. ఆ షెడ్యూల్‌ రషెష్ విషయంలో ప్రభాస్ సంతృప్తిని వ్యక్తం చేశాడు అనేది టాక్‌. ఇప్పటి వరకు రాజా డీలక్స్ అంటూ పేరు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా టైటిల్ ను ఎప్పటికి ప్రకటిస్తారు అనే విషయంలో క్లారిటీ లేదు.

తదుపరి షెడ్యూల్‌ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన రాజా డీలక్స్ అనే ఓల్డ్‌ థియేటర్‌ లో అనే సమాచారం అందుతోంది. ఆ సెట్టింగ్‌ నిర్మాణం దాదాపుగా పూర్తి అయ్యింది. కనుక త్వరలోనే రాజా డీలక్స్ థియేటర్‌ లో ప్రభాస్ అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మారుతి ఈ సినిమాతో ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని అలరించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడట.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.