Begin typing your search above and press return to search.

లీక్‌ ఫొటో : ప్రభాస్‌ ఫ్యాన్స్ కు కన్నుల వింధు

By:  Tupaki Desk   |   20 Jan 2022 6:03 AM GMT
లీక్‌ ఫొటో : ప్రభాస్‌ ఫ్యాన్స్ కు కన్నుల వింధు
X
ప్రభాస్ ఫ్యాన్స్‌ సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 'రాధేశ్యామ్‌' సినిమా విడుదలకు సిద్దంగా ఉంది కాని విడుదలకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. రెండు మూడు ఏళ్లుగా అభిమానులను ఊరిస్తున్న రాధేశ్యామ్‌ మొన్న సంక్రాంతికి రావాలని మొత్తం ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేశారు. కాని చివరి నిమిషంలో కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ కారణంగా ఉత్తర భారతంలో కేసులు విపరీంగా పెరిగడంతో ఆర్ ఆర్‌ ఆర్‌ తో పాటు ఈ సినిమా ను కూడా వాయిదా వేయడం జరిగింది. రాధేశ్యామ్‌ సినిమాను మార్చి లో విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. థర్డ్‌ వేవ్‌ ప్రభావం మార్చి వరకు తగ్గితే అప్పుడు రాధేశ్యామ్‌ ను విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ప్రభాస్‌ రాధేశ్యామ్‌ నుండి ఒక ఫొటో లీక్ అవ్వడంతో అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు.

రాధేశ్యామ్‌ సినిమాలోని ఆ స్టిల్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. హ్యాండ్సమ్ గా స్టైలిష్ గా కూడా ప్రభాస్ కనిపిస్తున్నాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాధేశ్యామ్‌ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది మొదలుకుని అభిమానులు అప్‌డేట్స్ కోసం మరియు ఫస్ట్‌ లుక్ కోసం తెగ సోషల్‌ మీడియాలో పోరాటం చేయడం జరిగింది. కాని ఇప్పుడు మాత్రం సినిమా నుండి బ్యాక్‌ టు బ్యాక్ పోస్టర్‌ లు విడుదల అవుతూ.. కొత్త పోస్టర్‌ లు లీక్‌ అవుతూనే ఉన్నాయి. రాధేశ్యామ్‌ సినిమా పై అంచనాలు మరింతగా పెంచుతున్నాయి. తాజాగా బయటకు వచ్చిన ప్రభాస్ స్టిల్‌ ను చూస్తుంటే గ్రీన్ మ్యాట్ ముందు ప్రభాస్‌ యాక్టింగ్‌ చేసిన సన్నివేశం స్టిల్ గా తెలుస్తోంది.

ఫైర్‌ ముందు కూర్చుని అలా ప్రభాస్ చిల్‌ అవుతున్న ఈ ఫొటో అభిమానులకు కన్నుల వింధు చేస్తుంది. రాధేశ్యామ్‌ సినిమా లో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. వీరిద్దరి యొక్క లవ్ స్టోరీ ఒక అద్బుత దృశ్య కావ్యం గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా లో ప్రభాస్ జాతకాలు చెప్పే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఫైట్స్ కాని కామెడీ కాని ఉండవని.. సినిమా లో ఉన్న ప్రేమ కథ ఒక యుద్దం తరహాలో ఉంటుందని అంటున్నారు. సృష్టికి విరుద్దంగా ప్రేమికులు వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు. హిందీ తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.