Begin typing your search above and press return to search.

నవంబర్ నుంచి ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' నాన్ స్టాప్ షూటింగ్..!

By:  Tupaki Desk   |   20 Sep 2021 7:36 AM GMT
నవంబర్ నుంచి ప్రభాస్ ప్రాజెక్ట్ K నాన్ స్టాప్ షూటింగ్..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ''ప్రాజెక్ట్ K'' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఇటీవలే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇందులో ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తుండగా.. బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మాత అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. లేటెస్టుగా ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన షూటింగ్ వివరాలను అశ్వినీ దత్ వెల్లడించారు.

ఇప్పటికే అమితాబ్ బచ్చన్ తో పది రోజుల షూటింగ్ జరిపామని.. నవంబర్ నుంచి 'ప్రాజెక్ట్ K' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని అశ్వినీ దత్ తెలిపారు. నాన్ స్టాప్ గా 12 నుంచి 13 నెలల పాటు నిర్విరామంగా చిత్రీకరణకు ప్లాన్ చేశామని.. ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశామని నిర్మాత చెప్పారు. నవంబర్ లో మొదలయ్యే షెడ్యూల్ లో ప్రభాస్ - అమితాబ్ తో పాటుగా మిగతా ప్రధాన తారాగణమంతా పాల్గొంటారని అశ్వినీ దత్ పేర్కొన్నారు. కాగా, సైన్స్ ఫిక్షన్ - సోషియో ఫాంటసీ జోనర్ లో రూపొందనున్న 'ప్రాజెక్ట్ K' చిత్రంలో.. స్టార్ కాస్టింగ్ - టాప్ టెక్నిషియన్స్ భాగం కానున్నారు.

లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ ఈ చిత్రానికి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తుండగా.. డానీ శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భారతీయ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ దాదాపు 200 రోజుల కాల్షీట్స్ కేటాయించారని తెలుస్తోంది. 'బాహుబలి' తరువాత డార్లింగ్ ఎక్కువ రోజులు వర్క్ చేసే చిత్రం ఇదే అవుతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడికానున్నాయి.