ప్రభాస్ అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు

Sun Jan 20 2019 17:04:48 GMT+0530 (IST)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత 'సాహో' చిత్రాన్ని మొదలు పెట్టిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న 'సాహో' చిత్రం షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. సాహో చిత్రీకరణలో ఉండగానే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఒక ప్రేమ కథా చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రానికి 'జాను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు 'సాహో' చిత్రం షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ ఆ షెడ్యూల్ పూర్తి చేసుకుని వెంటనే రాధాకృష్ణ దర్శకత్వంలోని మూవీకి షిప్ట్ అయ్యాడు.ఈమద్య కాలంలో యంగ్ హీరోలు ఇలా ఒకేసారి రెండు సినిమాలు చేయడం అనేది చాలా చాలా అరుదు. అది కూడా స్టార్ హీరోలు ఒకేసారి రెండు సినిమాలు చేయడం కనిపించడమే లేదు. బాహుబలి కోసం ఎక్కువ సమయం తీసుకున్న ప్రభాస్ సాహో వల్ల కూడా ఆలస్యం అవుతుందనే ఉద్దేశ్యంతో కష్టమైనా కూడా జాను చిత్రాన్ని చేస్తున్నాడు. రెండు సినిమాలు కూడా సమాంతరంగా చిత్రీకరణ జరుగుతున్నాయి. విడుదల విషయంలో కూడా కాస్త అటు ఇటుగానే ఉంటాయనిపిస్తుంది.

హైదరాబాద్ లో 'జాను' చిత్రీకరణలో ఉన్న ప్రభాస్ నేడు ఆదివారం అవ్వడంతో పాటు పెదనాన్న పుట్టిన రోజు అవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నాడు. మళ్లీ సోమవారం జాను చిత్రం షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అవ్వనున్నాడు. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా రెండు సినిమాలను కూడా పూర్తి చేసేందుకు ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు. సాహో చిత్రం పూర్తి యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం కాగా జాను ఒక క్లాస్ లవ్ స్టోరీ చిత్రంగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.