రెబల్ లుక్ : ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది

Sun Jan 26 2020 10:13:48 GMT+0530 (IST)

Prabhas New Look

యంగ్ రెబల్ స్టార్ స్టైలిష్ లుక్ కు లేడీ ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే. ప్రభాస్ ను మిర్చిలో అల్ట్రా స్టైలిష్ గా చూసిన ప్రేక్షకులు మైమర్చి పోయారు. అప్పటి నుండి మళ్లీ అలాంటి పాత్రలో అలాంటి కాస్ట్యూమ్స్ తో చూడాలని పదే పదే కోరుకుంటూనే ఉన్నారు. బాహుబలి చిత్రం సమయంలో ప్రభాస్ అలా కనిపించేందుకు వీలు పడలేదు. ఆ తర్వాత నటించిన సాహో చిత్రంతో తన స్టైల్ లుక్ తో అభిమానులను అలరించిన ప్రభాస్ ఇప్పుడు తన కొత్త సినిమాలో కూడా చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నాడట.ఇక తాజాగా ప్రభాస్ ఈ ఫార్మల్ లుక్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. షూటింగ్ కోసమో లేదంటే ఏదైనా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ఫార్మల్స్ ధరించాడో తెలియదు కాని ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ప్రభాస్ నుండి ఇలాంటి స్టైలిష్ లుక్ ను ఆశిస్తున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అంతా కూడా ఈ లుక్ కు ఫిదా అవుతున్నారు.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ మరియు కృష్ణంరాజులు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జాన్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.