సాహో స్టార్.. మహానటి డైరెక్టర్ క్రేజీ కాంబో ఫిక్స్

Wed Feb 26 2020 13:02:45 GMT+0530 (IST)

Prabhas Movie With Mahanati Director Nag Ashwin

ప్రభాస్ ఒక్కో సినిమాకు ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు.  పోనీ డైరెక్టర్లైనా క్రేజీగా ఉన్నారంటే అదీ లేదు. దీంతో అభిమానులకే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడా నీరసం వస్తోంది. అయితే ఇది మాత్రం అందరికీ ఒక్కసారిగా ఫుల్ జోష్ ఇచ్చే వార్త.  డార్లింగ్ తన నెక్స్ట్ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు.  'మహానటి' సినిమాతో నాగ్ అశ్విన్ కు భారీ గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే.  ఆ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న సినిమా ఇదే.ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజే రానుందని సమాచారం.  'మహానటి' సినిమా తర్వాత నాగ్ అశ్విన్ ఈ స్క్రిప్ట్ పై పని చేశారని.. ఈమధ్యే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడంతో ప్రభాస్ కు వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినిదత్ నిర్మిస్తారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రాధేశ్యామ్ అనే పేరును పరిశీలిస్తున్నారని ఈమధ్యే వార్తలు వచ్చాయి.  ఈ సినిమా పూర్తి కాగానే ప్రభాస్ - నాగ్ ఆశ్విన్ చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది.