నెవ్వర్ బిఫోర్ః మొట్టమొదటి ఇండియన్ హీరోగా ప్రభాస్!

Fri Jul 23 2021 22:00:01 GMT+0530 (IST)

Prabhas Most Handsome Asian Men

ప్రభాస్ స్టార్ డమ్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్.. అటు సినిమాలతోపాటు ఇటు పర్సనల్ విషయాల్లోనూ సత్తా చాటుతున్నాడు. లేటెస్ట్ గా ప్రభాస్ అందుకున్న రికార్డు చూశారంటే.. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అమ్మాయిల కలల రాకుమారుడి ఏ రేంజ్ లో ఉన్నాడో అర్థమైపోతుంది. స్టార్ డమ్ విషయంలోనే కాదు.. యువతుల మనసు దోచుకోవడంలోనూ ప్రభాస్ ఎవరెస్టుపై ఉన్నాడని కన్ఫామ్ అవుతుంది.'టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మెన్ - 2021' జాబితాలో ఏకంగా నెంబర్ వన్ ప్లేస్ సాధించాడు. అంటే.. ఏసియాలోనే రెబల్ స్టార్ ప్రభాస్ ను మించిన అందగాడు లేడని ఆ సర్వే చెబుతోంది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకూ ఇలాంటి సర్వేలు అంటే.. బాలీవుడ్ హీరోలు మాత్రమే రేసులో నిలిచేవారు. కానీ.. వారందరినీ పక్కకు నెట్టి ప్రభాస్ మొదటి స్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని అవధుల్లేకుండా పోతున్నాయి.

ఆసియాలోనే టాప్ 10లో ఉండే అందగాళ్ల జాబితా తాజాగా రిలీజ్ అయ్యింది. ఇందులో ప్రభాస్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించిన మొదటి ఇండియన్ హీరో ప్రభాస్ మాత్రమే కావడం గమనార్హం. దీంతో.. సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

ఇక ప్రభాస్ సినిమాల సంగతి చూస్తే.. మొత్తం నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్నాడు రెబల్ స్టార్. రాధేశ్యామ్ రిలీజ్ కు సిద్ధంగా ఉండగా.. సలార్ ఆదిపురుష్ సెట్స్ పై ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించే సైన్స్ ఫిక్స్.. ఈ రెండు చిత్రాల తర్వాత మొదలు కానుంది.