మ్యాచో మ్యాన్ ప్రభాస్ ఇస్మార్ట్ లుక్ వైరల్

Mon Aug 15 2022 09:52:24 GMT+0530 (IST)

Prabhas Machoo Look

డార్లింగ్ ప్రభాస్ గత కొంతకాలంగా బొత్తిగా నల్ల పూస అయిపోయాడు. ఇటీవలే సీతారామం ఈవెంట్లో ప్రత్యక్షమయ్యాడు. అతడి రూపం పూర్తిగా మారిపోయింది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు కాస్త స్మార్ట్ లుక్ కి  షిఫ్టయ్యాడు. ఓవైపు ఆదిపురుష్ 3డి రిలీజ్ కోసం ఉత్సాహంగా వేచి చూస్తున్న ప్రభాస్ సలార్ ని కూడా శరవేగంగా ముగించేస్తున్నాడు. ఇంతలోనే ఈ గ్యాప్ లో ఈవెంట్లకు కూడా హాజరవుతున్నాడు.మొన్నటికి మొన్న సీతారామం (దుల్కార్ సల్మాన్) ఈవెంట్లో కనిపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. వేదికపై తన ప్రాజెక్ట్ కే నిర్మాతలు స్వప్పాదత్ - అశ్వనిదత్ లను విపరీతంగా ప్రశంసించాడు. తన నిర్మాతల్లో స్వప్నాదత్ ది బెస్ట్ అని కూడా అశ్వనిదత్ ముందు కాంప్లిమెంట్ ఇచ్చేశాడు. సీతారామం చిత్రానికి ప్రభాస్ ప్రచారం పాన్ ఇండియా కేటగిరీలో అదనపు బూస్ట్ ని ఇచ్చిందనడంలో సందేహం లేదు.

ఇంతలోనే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు సలార్ నుండి సంథింగ్ స్పెషల్ ఉంటుందని ప్రకటించగా ప్రభాస్ అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. ఇంతలో ప్రభాస్ లుక్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో కనిపించాయి. అవి క్షణంలో వైరల్ గా మారాయి.

నిన్నటి మధ్యాహ్నం హైదరాబాద్ ఆవాసా హోటల్ లో సౌండ్ ఇంజనీర్ పప్పు (శ్రీనివాస్) కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్ కు ప్రభాస్ హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రభాస్ బ్లాక్ షర్ట్ ధరించి కనిపించాడు.

అతడు స్టైలిష్ గా  ఉబెర్ కూల్ లుక్ తో కనిపించాడు. ప్రభాస్ చాలా సింపుల్ గా కనిపిస్తున్నా.. తన రూపం బయటపడకుండా ఏదో దాస్తున్నట్టే కనిపించాడు. అతడు క్యాప్ పెట్టుకుని ఉండడంతో పూర్తిగా హెయిర్ స్టైల్ రివీల్ కాలేదు. సన్నగా గడ్డం పెరిగి ఉంది.

అంతగా మ్యాచో మాన్ లా కాకుండా స్లిమ్ గానే కనిపించడం ఆశ్చర్యపరిచింది. సలార్ నుంచి రానున్న గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.