Begin typing your search above and press return to search.

మార్ఫింగ్ ఆదిపురుష్.. ప్ర‌భాస్ ఆ రేంజులో ఛేంజోవ‌ర్ చూపిస్తాడా?

By:  Tupaki Desk   |   19 Jan 2021 11:30 AM GMT
మార్ఫింగ్ ఆదిపురుష్.. ప్ర‌భాస్ ఆ రేంజులో ఛేంజోవ‌ర్ చూపిస్తాడా?
X
బైసెప్.. ట్రైసెప్.. ఎనిమిది ప‌ల‌క‌ల‌ యాబ్స్ .. విశాలమైన షోల్డ‌ర్.. మెలితిరిగిన కండ‌ల‌తో ప్ర‌భాస్ ని ఈ తీరుగా ఎప్పుడైనా చూశారా? ఇంత‌కుముందు బాహుబ‌లి కోసం భీక‌రాకారుడిలా మారిన ప్ర‌భాస్ దానికోసం ఎంతో క‌ఠోరంగా శ్ర‌మించాడు. సుశిక్షితుడైన విదేశీ కోచ్ ని దీనికోసం ర‌ప్పించారు. అమ‌రేంద్ర బాహుబ‌లిగా భీక‌ర పోరాటాలు వార్ సీన్స్ కోసం ఎంతో ట్రైనింగ్ తీసుకున్నాడు.

ఇప్పుడు మ‌రోసారి అంత‌కుమించిన భీక‌రాకారాన్ని ప్రెజెంట్ చేసేందుకు డార్లింగ్ ఇప్ప‌టికే క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నాడ‌న్న స‌మాచారం ఉంది. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ 3డిలో శ్రీ‌రాముని త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మెలూహా క్వాలిటీస్ అత‌డిలో ఉంటాయ‌న్న గుస‌గుసా వినిపించింది. త‌న పాత్ర డిమాండ్ మేర‌కు ప్ర‌భాస్ భారీగా కండ‌లు పెంచుతాడ‌నే ఊహిస్తున్నారు. ఈ మూవీని విజువ‌ల్ ఎఫెక్ట్స్ మేళ‌వించి 3డిలో తెర‌కెక్కించ‌నున్నారు.

ప్ర‌భాస్ మ‌రోసారి త‌న రూపాన్ని ఓ రేంజులోనే చూపించ‌బోతున్నాడా? దానికోసం మేకోవ‌ర్ ఎలా ఉండ‌బోతోంది? అన్న ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఈ మూవీలో లెక్క‌కు మించి వీఎఫ్ ఎక్స్ షాట్స్ ఉంటాయ‌ని ఓంరౌత్ చెబుతున్నారు. భీక‌ర పోరాటాల‌తో ఆదిపురుష్ వ‌ర్సెస్ రావ‌ణ్ (సైఫ్ ఖాన్) విన్యాసాలు రక్తి క‌ట్టిస్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. రామాయ‌ణం క‌థ‌నే ఇంకాస్త స్పెష‌ల్ గా నేటి టెక్నాల‌జీతో చూపిస్తున్నారా? లేక ఇంకేదైనా డిఫ‌రెంట్ ప్ర‌య‌త్న‌మా? అన్న‌దానికి ఇంకా స‌మాధానం రావాల్సి ఉంది. అప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌భాస్ మార్ఫింగ్ ఫోటోని ఆదిపురుష్ అస‌లు లుక్ ఇదే అంటూ ఫ్యాన్స్ వైర‌ల్ చేస్తున్నారు. ఈ ఫోటో వైర‌ల్ గా దూసుకుపోతోంది.