Begin typing your search above and press return to search.

డాన్ లా పోర్ట్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ ప్ర‌భాస్.. స‌డెన్ షాకిచ్చాడిలా!

By:  Tupaki Desk   |   21 July 2021 2:45 PM GMT
డాన్ లా పోర్ట్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ ప్ర‌భాస్.. స‌డెన్ షాకిచ్చాడిలా!
X
డార్లింగ్ ప్ర‌భాస్ విమానాశ్ర‌యంలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. ఇటలీ పర్యటనను ముగించి ఈ రోజు హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. ఓవైపు వ‌ర్షం కురుస్తుంటే శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయటికి వెళుతూ క‌నిపించిన ప్రభాస్ గెట‌ప్ చూసి అభిమానులు స్ట‌న్న‌య్యారు. అత‌డు అత‌డేనా..? ఇంకెవ‌రైనానా? అంటూ కాసేపు ఫ్యాన్స్ క‌న్ఫ్యూజ్ అయ్యారు.

అత‌డు ఎయిర్ పోర్ట్ లో డాన్ లా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. అత‌డి వేష‌ధార‌ణ డిఫ‌రెంట్ గా క‌నిపించింది. మాఫియా ల‌క్ష‌ణాలున్న అధునాత‌న యువ‌కుడిలా క‌నిపించాడు. లూజ్ బ్లాక్ ష‌ర్ట్ .. పెన్సిల్ క‌ట్ ఫ్యాంట్ తో అత‌డి రూపం ఎంతో ఇంట్రెస్టింగ్ గా క‌నిపిస్తోంది. ముఖ్యంగా తన జుట్టును బీనితో కవ‌ర్ చేయ‌డంతో అది అంద‌రికీ స‌ర్ ప్రైజింగ్ గా మారింది. అతను సాధారణ దుస్తులు ధరించి సింపుల్ గా క‌నిపిస్తున్నా.. త‌న ముఖాన్ని రివీల్ చేసేందుకు మాత్రం అస్స‌లు ఆస‌క్తిగా లేడు. బ్లాక్ టీ షర్టు లేత గోధుమరంగు ప్యాంటు ధరించి తన తలని కప్పడానికి సరిపోయే బ్లాక్ బీని ధరించాడు. అతను సన్ గ్లాసెస్ .. స్నీకర్లతో స్పెష‌ల్ గా క‌నిపిస్తున్నాడు. ముఖానికి మాస్క్ అంతే ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంది.

ప్రభాస్ ఇంత‌కీ ఇటలీ ఎందుకు వెళ్లారు? అంటే.. అత‌డు రాధే శ్యామ్ కి సంబంధించిన‌ చిన్న భాగం షూటింగ్ ని పూర్తి చేసేందుకు వెళ్లాడట‌. అది పూర్తి చేసి ఇలా న‌గ‌రంలోకి అడుగుపెట్టాడ‌ట‌. త‌దుప‌రి స‌లార్ చిత్రీక‌ర‌ణ‌కు హాజ‌ర‌వుతాడ‌ని తెలుస్తోంది. ఓవైపు ఆదిపురుష్ 3డి షెడ్యూల్ పూర్తి చేస్తూనే స‌లార్ కోసం అత‌డు డేట్లు ఇచ్చాడని తెలిసింది. స‌లార్ ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ని అదిరిపోయే రేంజులో తెర‌కెక్కిస్తార‌న్న గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి.

సైన్స్ ఫిక్ష‌న్ ఓ రేంజులో..!

మ‌రోవైపు ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ ని ప్రారంభించాల్సి ఉంది. ఈ సినిమాతో ప్ర‌భాస్ పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా ఎలివేట్ కానున్నాడ‌ని నాగ్ అశ్విన్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ -దీపికా పదుకొనే లాంటి టాప్ స్టార్లు న‌టిస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచుతోంది. మ‌రోవైపు `రాధే శ్యామ్` విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యువి బృందాలు రిలీజ్ తేదీని లాక్ చేశాయ‌నే అంతా భావిస్తున్నారు. ప్ర‌స్తుతానికి రాధేశ్యామ్ ని స‌ల్మాన్ రాధే మోడ‌ల్ ఓటీటీ ప్ల‌స్ థియేట‌ర్స్ లో డైరెక్ట్ రిలీజ్ చేస్తార‌నే ఇంకా సందిగ్ధ‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అన్నిటికీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

బిజీ లైఫ్ లో పెళ్లిని మ‌రిచాడా?

డార్లింగ్ బిజీ లైఫ్ ని చూస్తుంటే అత‌డు ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేడ‌ని అర్థ‌మ‌వుతోంది. బ్యాక్ టు బ్యాక్ అత‌డు వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్ప‌టికే నాలుగు సినిమాల‌తో బిజీ బిజీ. ఇవ‌న్నీ పూర్త‌య్యేందుకే మ‌రో రెండేళ్లు పైగా ప‌డుతుంది. ఇలాంటి స‌న్నివేశంలో పెళ్లి అన్న ప్ర‌స‌క్తే లేకుండా అత‌డు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుంటే అంతా క‌న్ఫ్యూజన్ లోనే ఉన్నారు. నిజానికి బాహుబ‌లి రిలీజ‌య్యాక ప్ర‌భాస్ పెళ్లి ఉంటుంద‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఆ త‌ర్వాత సాహో పూర్త‌వ్వాలి అన్నారు. కానీ ఆ త‌ర్వాత కూడా అత‌డి శైలి మార‌లేదు. పారిశ్రామిక వేత్త కూతురు.. నాయ‌కుడి కుమార్తె అంటూ ఇంత‌కుముందులా క‌నీసం గుస‌గుస‌లు కూడా లేవ్. చూస్తుంటే బిజీ లైఫ్ లో ప‌డి పెళ్లిని మ‌రిచాడా? అంటూ అభిమానులు ఫుల్ క‌న్ఫ్యూజన్ లో ఉన్నారు. మ‌రి ఏదో ఒక ఇంట‌ర్వ్యూలో ఈ ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌భాస్ స‌మాధాన‌మిస్తారేమో చూడాలి.