ఫోటోటాక్ : సలార్ ఫోజ్ కేజీఎఫ్ ను దున్నేసేలా ఉంది

Sun May 15 2022 20:00:01 GMT+0530 (IST)

Prabhas In Salaar Shoot

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్ 2 సినిమా విడుదల తర్వాత సలార్ సినిమా పై ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు పెరిగి పోతున్నాయి. బాహుబలి.. సాహో సినిమాలతో బాలీవుడ్ లో స్టార్ డమ్ దక్కించుకున్న ప్రభాస్ తో కేజీఎఫ్ చిత్ర దర్శకుడి సినిమా అనగానే అక్కడి ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు.ప్రభాస్ సలార్ లో ఎలా కనిపించబోతున్నాడో ఇప్పటికే ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సినిమా సెట్స్ నుండి లీక్ అయిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేజీఎఫ్ ను దున్నేసేంత మాస్ గా ప్రభాస్ ఈ లీక్ అయిన ఫోటోలో కనిపిస్తున్నాడు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సలార్ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 30 శాతం వరకు పూర్తి అయ్యిందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ మద్య కేజీఎఫ్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబో సినిమా మళ్లీ షూటింగ్ ప్రారంభం అవ్వాల్సిన సమయం వచ్చింది. ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ అతి త్వరలోనే సలార్ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.

సలార్ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండి ఆన్ లొకేషన్ ఏదో ఒక స్టిల్ బయటకు వచ్చి సినిమా  పై అంచనాలు పెంచుతూనే ఉంది. ఈ సినిమా కు సంబంధించిన లీక్ లను ఎవరు చేస్తున్నారు అనే విషయం లో క్లారిటీ లేదు. కాని లీక్ ల వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుంది అనేదిసినీ విశ్లేషకుల అభిప్రాయం.

సలార్ సినిమా లో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా లో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. తప్పకుండా ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా నచ్చే విధంగా ఉండి... కేజీఎఫ్ 2 రికార్డు లను బ్రేక్ చేస్తుందేమో చూడాలి.