ప్రభాస్ హృతిక్ కాంబో.. ఇది మ్యాటర్!

Tue Jan 24 2023 13:52:45 GMT+0530 (India Standard Time)

Prabhas, Hrithik Combo.. It Matters!

టాలీవుడ్ లో కాని.. బాలీవుడ్ లో కాని అనేకమంది హీరోలు తమ స్థాయికి తగిన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. కానీ బాలీవుడ్ లో ఆరడుగుల అందగాడు ఎవరబ్బా అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు హృతిక్ రోషన్. అదే విధంగా తెలుగు విషయానికి వస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది. బొమ్మ బ్లాక్ బస్టర్. అవును వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.ఇటీవలే మైత్రి మూవీ మేకర్ సంస్థ ఒకపక్క వాల్తేరు వీరయ్య మరోపక్క వీరసింహారెడ్డి సినిమాలతో మంచి బ్లాక్ బస్టర్ ఫలితాలను అందుకుని భారీ వసూళ్ల రాబడుతోంది. ఇక మైత్రి మూవీ మేకర్ సంస్థ సిద్ధార్థ ఆనంద్ ని ప్రభాస్ తో ఒక సినిమా చేయమని కోరినట్లుగా తెలుస్తోంది. దానికి కూడా ఆయన అంగీకరించడంతో ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సిద్ధార్థ ఆనంద్ పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

షారుక్ ఖాన్ దీపికా పడుకొనే జాన్ అబ్రహం వంటి వాళ్ళు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధిస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

తర్వాత సిద్ధార్థ ఆనంద్ హృతిక్ రోషన్ తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే బ్యాంగ్ బ్యాంగ్ వార్  వంటి సినిమాలు చేయడంతో వారిద్దరి మధ్య మంచి రాపో ఉంది.

ఇక హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్ ను ఒక అతిథి పాత్ర కోసం తీసుకోవాలని వీరి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం అయితే జరుగుతోంది.

ఒకరకంగా ఇలాంటి ఇద్దరు స్టార్ హీరోలు ఒక సినిమాలో కనిపిస్తే ఆ సినిమా యొక్క బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి. మరి చూడాలి ఇది ఎంతవరకు నిజమవుతుందో అసలు ఈ ప్రచారం నిజమేనో కాదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.