ప్రభాస్ ని ప్రశ్నించే ముందు ఆలోచించలేదా?

Sat Aug 24 2019 13:40:19 GMT+0530 (IST)

Prabhas Gets Shocking Question From Journalist In Bangalore Press Meet

డార్లింగ్ ప్రభాస్ సుడిగాలి ప్రచారం ప్రస్తుతం హాట్ టాపిక్. ఏ చోట చూసినా `సాహో` ప్రచారమే. ఆగస్టు 30 రిలీజ్ వరకూ ఇదే సన్నివేశం ఉండనుంది. అన్ని మెట్రో నగరాల్ని సునామీలా చుట్టేస్తూ `నేను ఈడా ఉంటా ఆడా ఉంటా` అన్నట్టే కనిపిస్తున్నాడు. నిన్న ముంబైలో ఉంటే నేడు బెంగళూరులో ప్రత్యక్షమయ్యాడు. ఉన్నట్టుండి అక్కడ మీడియాతో ఇంటరాక్షన్ పేరుతో చాలా టైమ్ స్పెండ్ చేశాడు. అయితే అక్కడ మీడియా నుంచి ఈసారి డార్లింగ్ ప్రభాస్ కి ఊహించని ఓ ప్రశ్న ఎదురైంది.ఆ ప్రశ్న ఏమిటి? అంటే.. ఇటీవల కర్నాటకను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఏకంగా 80 మంది వరకూ ప్రజలు చనిపోయారు. వరదబాధితులకు అన్ని వర్గాల నుంచి సాయం కోరింది ప్రభుత్వం. అదే టైమ్ లో టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు రూ.2లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ ఓ జర్నలిస్టు ప్రభాస్ ని ప్రశ్నించారు. సంపూ విరాళం ఇచ్చారు. మీరేం చేశారు? అంటూ ప్రశ్నించడంతో ప్రభాస్ ఏమాత్రం తొణికిసలాడకుండా ``ఐ విల్ డూ మై బెస్ట్.. తప్పకుండా చేస్తాను. ఇలాంటివి జరిగినపుడు నేను సహాయం చేస్తూనే ఉన్నాను`` అంటూ జవాబిచ్చారు. సాహో గురించి .. పెళ్లి గురించి.. ప్రేమకథా చిత్రాల గురించి.. అన్నిటి గురించి చకచకా సమాధానాలిచ్చిన ప్రభాస్ ఓ క్షణం తటపటాయించి ఆన్సర్ చెప్పాల్సొచ్చింది.

నిజమే ప్రభాస్ ని ఎవరైనా జర్నలిస్ట్ ప్రశ్నించే ముందు కాస్తంత ఆలోచించి అడగాలి. పైగా సంపూతో పోల్చి అడగడం కూడా సరికాదు. ఎందుకంటే ఇంతకుముందు కేరళను వరదలు ముంచెత్తినప్పుడు ప్రభాస్ వెంటనే స్పందించి కోటి విరాళం సీఎం నిధికి అందించారు. చాలా మంది టాలీవుడ్- కోలీవుడ్ స్టార్లతో పోలిస్తే అతడు ఇచ్చింది చాలా ఎక్కువ. కేరళ హోంమంత్రి అంతటి వారే బన్ని.. ప్రభాస్ ని..  చూసి నేర్చుకోండి అని మలయాళీ స్టార్లపై సెటైర్ వేశారంటేనే అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం సాహో ప్రచారం బిజీలో ఉన్న ప్రభాస్ పూర్తిగా దానిపైనే దృష్టి సారించారు. ఈ బిజీ తగ్గితే బహుశా ఈసారి వరదబాధితులపైనా దృష్టి సారించే వీలుంటుంది.

ఇక ఈ ఇంటర్వ్యూలో భక్త కన్నప్ప లాంటి చిత్రంలో నటించరా? అన్న ప్రశ్నకు ప్రభాస్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కన్నడలో రాజ్ కుమార్ సర్ భక్తకన్నప్ప చేశారు. తెలుగులో బాపుగారు దర్శకత్వంలో భక్త కన్నప్ప తీశారు. తప్పకుండా అలాంటి సినిమా చేస్తాను.. అని అన్నారు. ``ప్రభాస్ అన్నయ్యా మీ పెళ్లెప్పుడు?  ఎప్పటికి పిలుస్తారు? వదినను మాకు ఎప్పుడు పరిచయం చేయారా?  అన్న ప్రశ్న ఎదురైంది. దానికి ప్రభాస్ సింపుల్ గా నవ్వేస్తూ `తెలియదు` అంటూ తప్పించుకున్నారు.  అలాగే అనుష్కతో ఎఫైర్ విషయమై స్పందిస్తూ .. ఇదంతా మీరే సృష్టించారు. మీరే సమాధానం చెప్పండి! అని రివర్స్ కౌంటర్ వేశారు డార్లింగ్. సాహో అనే పదానికి జైహో అనే అర్థం వస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.