Begin typing your search above and press return to search.

ఈవిడ ఏంటి..? ఇంత పొడవు వుంది.. హీల్స్ వేసిందా..!?

By:  Tupaki Desk   |   4 March 2021 5:56 PM GMT
ఈవిడ ఏంటి..? ఇంత పొడవు వుంది.. హీల్స్ వేసిందా..!?
X
``ఈవిడ ఏంటి..? ఇంత పొడవు వుంది.. నిజమేనా.. ఏమైనా హీల్స్ వేసిందా..!?`` .. ఈ స‌రదా వ్యాఖ్య ఎవ‌రిదో తెలుసా?.. ఇంకెవ‌రు.. డార్లింగ్ ప్ర‌భాస్. ఎవ‌రిని అలా అన్నారు? అంటే.. జాతిరత్నాలు హీరోయిన్ ఫ‌రియా అబ్ధుల్లాని అలా అన్నారు. యూట్యూబ‌ర్ ఫ‌రియా క‌థ‌నాయిక‌గా ప‌రిచయం అవుతున్న సంగ‌తి తెలిసిందే. త‌న తొలి చిత్రం జాతి ర‌త్నాలు రిలీజ్ సంద‌ర్భంగా ట్రైల‌ర్ విడుద‌ల కోసం ముంబై వెళ్లి మ‌రీ ప్ర‌భాస్ ని క‌లుసుకున్నారు టీమ్ స‌భ్యులతో. ఈ సంద‌ర్భంగా ఫరియాని చూసి స్పెల్ బౌండ్ అయిపోయిన డార్లింగ్ ఆగ‌లేక ఆ కామెంట్ చేశారు. ఫరియా హైట్ చూసి అలా స‌ర‌దా వ్యాఖ్యానం చేశారు.

ఫ‌రియా ఎవ‌రు? అంటే.. ఇంత‌కుముందే ``చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే`` అనే పాటతో అంద‌రినీ త‌న‌వైపు తిప్పేసుకున్న ఫ‌రియా హైద‌రాబాదీ కాలేజ్ గాళ్. యూట్యూబ్ లో ఇప్ప‌టికే ఫేమ‌స్. న‌వీన్ పొలిశెట్టి- ప్రియ‌ద‌ర్శి- రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న `జాతి ర‌త్నాలు`లో ఫ‌రియా ఫ‌న్నీ గాళ్ గా క‌నిపించ‌నుంది.

క్యూట్ లుక్స్ తో క‌నిపిస్తున్న ఈ అమ్మ‌డు అప్పుడే స్టార్ హీరోల దృష్టిని విశేషంగా ఆక‌ర్షిస్తోంది. తెలుగ‌మ్మాయిల‌కు తెలుగులో అవ‌కాశాలు ఉండ‌వ‌ని అంటారు. కానీ అందుకు భిన్నంగా నాగ్ అశ్విన్ తాను నిర్మిస్తున్న సినిమాలో తెలుగ‌మ్మాయి ఫ‌రియాకి అవ‌కాశం ఇచ్చారు. ఈ చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహించారు. ఈ నెల 11న విడుదలవుతోంది. ప్ర‌భాస్ ట్రైల‌ర్ లాంచ్ చేయ‌గా అభిమానుల్లోకి దూసుకెళ్లింది.