త్వరగా చేసుకో స్వీటీ.. అంటాడట!

Wed Aug 21 2019 22:57:54 GMT+0530 (IST)

Prabhas Clarified On His Marriage Once Again!

'సాహో' విడుదలకు మరో ఎనిమిది రోజులే ఉండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.  ప్రభాస్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ 'సాహో' విశేషాలు పంచుకుంటున్నాడు.  రీసెంట్ గా ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో పరమ రొటీన్ ప్రశ్నను అడిగారు.   ఆప్రశ్న ఏంటో అందరికీ తెలిసిందే. "ప్రభాస్ - అనుష్క రిలేషన్ ఏంటి.. పెళ్ళి ఎప్పుడు?" అనేదే ఆ ప్రశ్న.అయితే దీనికి ప్రభాస్ జవాబు ఏమాత్రం రొటీన్ గా లేదు.  "నేనో లేక అనుష్క ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటే కానీ ఈ పుకార్లు ఆగేలా లేవు.  ఈ విషయం అనుష్కకు చెప్తాను. నువ్వైనా త్వరగా పెళ్లి చేసుకో అని అనుష్క కు చెప్తా" అంటూ సరదాగా నవ్వుతూ కామెంట్ చేశాడు.  దీన్ని మళ్ళీ వంకరగా అర్థం చేసుకుంటారేమో కొందరు మేథావి  జనాలు. ప్రభాస్ ఉద్దేశం 'ఇద్దరిలో ఒకరు వేరే ఎవరినైనా పెళ్ళి చేసుకుంటే' అని.   ప్రభాస్ అనుష్కను.. అనుష్క ప్రభాస్ ను కాదు బాబోయ్!  ఈ పార్ట్ వరకూ డిఫరెంట్.. మిగతా సమాధానం అంతా పరమ రొటీనే.   ఒకవేళ తాము రిలేషన్ లో ఉంటే కలిసి తిరిగేవాళ్ళం కదా.. ఇందులో అసలు దాచాల్సిన విషయం ఏంటో నాకు అర్థం కావడం లేదని గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాన్నే మరోసారి బల్లగుద్ది చెప్పాడు.   

ప్రభాస్ 'సాహో' ఆగష్టు 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ను యూవీ క్రియేషన్స్ వారు రూ. 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్టు సమాచారం. 'బాహుబలి' ఫ్రాంచైజీ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో 'సాహో'పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి వ్యక్తం అవుతోంది.  మరి ఈ భారీ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.