Begin typing your search above and press return to search.

సాహోకి బిగ్ బాస్ కనెక్షన్!

By:  Tupaki Desk   |   7 July 2019 6:01 AM GMT
సాహోకి బిగ్ బాస్ కనెక్షన్!
X
ఇంకో వారం రోజులు పూర్తయితే సాహో విడుదలకు కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఇప్పటిదాకా టీజర్ తో పాటు ఒక ఆడియో సింగల్ ప్రీ రిలీజ్ వీడియో ఆన్ లైన్లో వదిలారు తప్ప అంతకు మించి హడావిడి ఇంకా చేయలేదు. ప్రమోషన్ విషయంలో కొంత వెనుకబడినట్టుగా కనిపిస్తున్న సాహో టీమ్ ఇకపై స్పీడ్ ని ఓ రేంజ్ లో పెంచబోతోందట. ప్రభాస్ సైతం కేవలం దీని కోసమే ప్రత్యేకంగా షెడ్యూల్ కేటాయించుకుని మీడియాకు అందుబాటులోకి రాబోతున్నట్టు సమాచారం.

అయితే వీటితో పాటు సాహో యూనిట్ ప్రత్యేకంగా టీవీ రియాలిటీ షోలను టార్గెట్ చేసినట్టుగా తెలిసింది. అందులో భాగంగా నాగార్జున యాంకర్ గా త్వరలో ప్రారంభమయ్యే బిగ్ బాస్ 3 హౌస్ లోకి ప్రభాస్ శ్రద్ధ కపూర్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఖచ్చితమైన తేదీ బయటికి రాలేదు కానీ నాగ్ ముందస్తుగా ఈ ప్లాన్ సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. ఇదే కాదు యాంకర్ ప్రదీప్ నిర్వహించే సూపర్ హిట్ టాక్ షో కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను కొత్త సీజన్ కు సైతం సాహో జోడి రాబోతున్నట్టు తెలిసింది.

వరల్డ్ కప్ లో ఇండియా అప్రతిహతంగా దూసుకుపోతున్న కారణంగా ప్రేక్షకులు సినిమా మూడ్ లో ఉండరనే ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఫైనల్ మ్యాచ్ కాగానే రోజుకో అప్ డేట్ ఉండేలా సాహో టీం పక్కా ప్లాన్ తో ఉందట. కనివిని ఎరుగని స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండబోతోంది. ఎక్కడ చేస్తారు ఎవరు అతిధులుగా వస్తారు లాంటి వివరాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. జీబ్రాన్ నేపధ్య సంగీతం అందిస్తున్న సాహో టాలీవుడ్ హిస్టరీలో బిగ్గెస్ట్ కమర్షియల్ రిలీజ్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి