మరోసారి ప్రభాస్ అనుష్క కాంబో?

Fri Jul 01 2022 14:04:15 GMT+0530 (India Standard Time)

Prabhas Anushka Combo Again

స్టార్ హీరోయిన్ అనుష్క బాహుబలి సినిమా తర్వాత స్పీడ్ పెంచుతుంది అనుకుంటే ఆ తర్వాత ఆమె మరింత నెమ్మదిగా సినిమాలో చేసుకుంటూ వెళుతుంది. నిశ్శబ్దం సినిమా తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాని అనుష్క తదుపరి ప్రాజెక్టును యూవీ క్రియేషన్స్ లోనే చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టి కథానాయకుడుగా నటిస్తూ ఉండగా హీరో కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళగా అనుష్క కనిపించబోతోంది.డిఫరెంట్ ఏజెస్ గ్రూప్ లవ్ స్టోరీ గా రాబోతున్న ఆ సినిమా కోసం అనుష్క కాస్త బరువు కూడా తగ్గనుందట. అయితే ఇంకా ప్రాజెక్ట్ మాత్రం మొదలవ్వలేదు. ఇక ఇంతలో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అనుష్క మాత్రం ఇప్పుడు ఎంత పారితోషికం ఇచ్చినా కూడా కమర్షియల్ పాత్రలో నటించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. కేవలం తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేసుకుంటూ వెళ్లాలని అనుకుంటుంది.

ఇక రీసెంట్ గా అనుష్క ప్రభాస్ తో కూడా సినిమా చేసేందుకు చర్చల్లోకి వెళ్లినట్లు సమాచారం. మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

హారర్ కామెడీ డ్రామా గా కాబోతున్న ఆ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా అనుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఆ ప్రాజెక్టు పై అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ జరగాల్సిన పనులన్నీ కూడా కొనసాగుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ప్రత్యేకంగా ఒక భారీ బంగ్లా సెట్ నిర్మాణం కూడా జరిగిందని చెబుతున్నారు. ఇక అనుష్కను అందులో ఒక హీరోయిన్ గా అనుకుంటున్నారట. సినిమాల్లో మొత్తంగా ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు అని తెలుస్తోంది.

ఇక అనుష్క క్యారెక్టర్ గురించి వినగానే వెంటనే ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదివరకే ప్రభాస్ తో మూడుసార్లు నటించిన అనుష్క ఇప్పుడు నాలుగోసారి కూడా నటించే అవకాశం ఉన్నట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.